ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన సుస్మితా సేన్

Sushmita finally breaks silence. ఐపీఎల్ మాజీ చీఫ్, మాజీ మిస్ ఇండియా సుస్మితా సేన్ గురించి సోషల్ మీడియాలోనూ

By Medi Samrat  Published on  15 July 2022 9:09 PM IST
ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన సుస్మితా సేన్

ఐపీఎల్ మాజీ చీఫ్, మాజీ మిస్ ఇండియా సుస్మితా సేన్ గురించి సోషల్ మీడియాలోనూ, మీడియాలోనూ తీవ్ర చర్చ జరిగిన సంగతి తెలిసిందే..! ఈ వార్తలపై శుక్ర‌వారం సుస్మితా సేన్ ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా స్పందించింది. ల‌లిత్ మోదీ పేరును ప్ర‌స్తావించ‌కుండా త‌న‌కు ఇంకా పెళ్లి కాలేద‌ని, క‌నీసం ఎంగేజ్ మెంట్ కూడా కాలేద‌ని వెల్ల‌డించింది. తాను తనకు సంబంధించిన వారితో ప్ర‌స్తుతం సంతోషంగా ఉన్నాన‌ని ఆమె తెలిపింది. ఈ వ్య‌వ‌హారంపై తాను పూర్తి స్థాయిలో స్ప‌ష్ట‌త ఇచ్చినట్టుగానే భావిస్తున్నాన‌ని ఆమె పేర్కొంది. ఆ ఫొటోలో సుస్మిత తన కుమార్తెలతో కనిపించింది.

సుస్మితా సేన్‌, తాను డేటింగ్‌లో ఉన్నామని మాజీ ఐపీఎల్‌ చైర్మన్‌ లలిత్‌ మోదీ గురువారం సోషల్‌ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరు మాల్దీవుల్లో షికార్లు చేసిన ఫొటోలను లలిత్‌ మోదీ షేర్‌ చేశాడు. ఈ సందర్భంగా సుస్మితాను తన బెటర్‌ హాఫ్‌(భార్య) అంటూ పరిచయం చేశాడు మోదీ. ఆ తర్వాత ప్రస్తుతం తాము డేటింగ్‌లో ఉన్నామనీ, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఆర్థిక నేరగాడితో సుస్మితా సేన్ ఉండడాన్ని ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఇప్పుడు తమ మధ్య ఎటువంటి బంధం ఉందో సుస్మితా సేన్ చెప్పకపోయినప్పటికీ.. పెళ్లి, ఎంగేజ్మెంట్ అయితే అవ్వలేదని చెప్పుకొచ్చింది.










Next Story