సుశాంత్‌ది ఆత్మహత్య కాదు.. హత్య : పోస్టుమార్టం సిబ్బంది షాకింగ్ కామెంట్స్‌

'Sushant Singh Rajput Was Murdered', Claims Cooper Hospital Employee Who Witnessed Post-mortem. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిని వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి.

By M.S.R  Published on  26 Dec 2022 8:30 PM IST
సుశాంత్‌ది ఆత్మహత్య కాదు.. హత్య : పోస్టుమార్టం సిబ్బంది షాకింగ్ కామెంట్స్‌
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిని వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. జూన్ 14, 2020లో ముంబయిలోని తన ఇంట్లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ చేసుకుని చనిపోయాడు. కానీ అతడ్ని హత్య చేసినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. సుశాంత్ బాడీకి పోస్ట్ మార్టం చేసిన కూపర్‌ ఆసుపత్రిలోని సిబ్బందిలో ఒకరు తాజాగా సుశాంత్ బాడీపై తాను గాయాలని చూసినట్లు వెల్లడించాడు. సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్ చనిపోయిన రోజు ఆసుపత్రికి 5 శవాలు వచ్చాయి. సుశాంత్ బాడీకి పోస్ట్‌మార్టం చేసే సమయంలో అతని శరీరంపై నేను గాయాలు చూశానని సదరు వ్యక్తి చెప్పుకొచ్చాడు. అలానే మెడపై కూడా గాయం గుర్తులు కనిపించాయి. బాడీ పోస్ట్‌మార్టం సమయంలో వీడియో తీస్తాము. కానీ సుశాంత్ బాడీ విషయంలో అది జరగలేదు. అధికారులు వీడియో తీయొద్దని ముందే చెప్పారు. కేవలం ఫొటోలు మాత్రమే తీసి పోస్ట్‌మార్టం పూర్తి చేయాలని ఆదేశించారు. దాంతో వారి ఆదేశాల మేరకు పోస్ట్‌మార్టం చేసి బాడీని పోలీసులకి అప్పగించాం. కానీ సుశాంత్ బాడీపై ఉన్న గాయాల్ని పరిశీలిస్తే? అది సూసైడ్ కాదు హత్యేనని నాకు అర్థమైందని ఆ వ్యక్తి తెలిపాడు. ఉన్నతాధికారులకు సుశాంత్‌ సింగ్‌ది హత్య అని కూడా చెప్పాను.. సుశాంత్‌ డెడ్‌బాడీ చూసిన మొదటిసారి వెంటనే ఇది ఆత్మహత్య కాదు హత్య అని నా సీనియర్లకు చెప్పానన్నాడు.. వారు తననేమీ మాట్లాడనివ్వలేదని పోస్ట్‌ మార్టం నిర్వహించిన వ్యక్తి సంచలన విషయాలను బయటపెట్టాడు.


Next Story