సూర్య 'కంగువ' రిలీజ్ డేట్ వచ్చేసింది.!

సూర్య హీరోగా నటిస్తున్న కంగువ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం థియేటర్లలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు

By Medi Samrat  Published on  19 Sept 2024 9:00 PM IST
సూర్య కంగువ రిలీజ్ డేట్ వచ్చేసింది.!

సూర్య హీరోగా నటిస్తున్న కంగువ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం థియేటర్లలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. దర్శకుడు శివ భారీ ఎత్తున సినిమాను తెరకెక్కిస్తూ ఉన్నామని తప్పకుండా అంచనాలను అందుకుంటామని ఇప్పటికే హామీ ఇచ్చారు. ముందుగా, సూర్య 'కంగువ' నిర్మాతలు ఈ చిత్రాన్ని అక్టోబర్ 10 న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే, సూపర్ స్టార్ రజనీకాంత్ 'వేట్టైయన్' రాక కారణంగా కంగువ విడుదల ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగింది. చిత్ర యూనిట్ కూడా సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రమోషనల్ కార్యక్రమాలు చేయకపోవడంతో అక్టోబర్ 10న సినిమా రాక కష్టమనే ప్రచారం సాగింది.

ఇప్పుడు కంగువ రిలీజ్ డేట్ గురించి అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్టర్‌ను షేర్ చేస్తూ, చిత్ర నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ ఈ చిత్రం నవంబర్ 14న థియేటర్లలో సందడి చేయబోతోందని తెలిపారు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్, దిశా పటానీ కూడా నటిస్తూ ఉన్నారు. కంగువలో జగపతి బాబు, నటరాజన్ సుబ్రమణ్యం, యోగి బాబు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Next Story