కంగువా సినిమా ముందు ఉన్న టార్గెట్ ఎంతంటే.?
సినీ లవర్స్ కంగువా సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు.
By Medi Samrat Published on 12 Nov 2024 1:17 PM GMTసినీ లవర్స్ కంగువా సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. ఓ వైపు తెలుగులో వరుణ్ తేజ్ మట్కా సినిమా విడుదల అవుతున్నా కూడా కంగువా గురించే ఎక్కువ మాట్లాడుకుంటూ ఉన్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా కంగువాకు భారీగానే ఉన్నాయి. ఈ ఫాంటసీ యాక్షన్ చిత్రం మంచి బజ్ క్రియేట్ చేయగలిగింది. ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచేసింది.
కంగువ సినిమాకు బలమైన ఓపెనింగ్స్ దక్కనున్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే తమిళనాడు రైట్స్ 70 కోట్ల రూపాయలు కాగా కేరళ 10 కోట్ల రూపాయలు. సూర్య బాగా ప్రమోట్ చేస్తున్న తెలుగు రాష్ట్రాలలో రూ. 30 కోట్లకు అమ్మేశారు. కర్ణాటక హక్కుల విలువ రూ. 10 కోట్లు మాత్రమే. హిందీ థియేట్రికల్ రైట్స్ విలువ రూ. 30 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ 40 కోట్లతో బిజినెస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్స్ మొత్తం రూ.190 కోట్లకు చేరాయి. యావరేజ్ టాక్ వచ్చినా కూడా ఈ టార్గెట్ ను కంగువా సినిమా అందుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు.