అభిమాని పెళ్లిలో సందడి చేసిన హీరో సూర్య..!

Suriya Attends A Fan's Wedding Ceremony. ఆలిండియా సూర్య ఫ్యాన్ క్లబ్ సభ్యుడైన హరిక పెళ్లికి సూర్య వధువు మెడలో తాళి కట్టే సమయానికి మండపానికి చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు.

By Medi Samrat  Published on  25 Jan 2021 6:55 PM IST
Suriya Attends A Fan’s Wedding Ceremony

ఒక సినిమాను తెరకెక్కించాలంటే ఎంతోమంది ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.ఆ విధంగా ఎంతో కష్టంతో తెరకెక్కించిన సినిమా విజయవంతం అయినప్పుడే కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది.ఆ విధంగా ఎంతో కష్టపడి తీసిన సినిమాలు ప్రేక్షకులు ఆదరించినప్పుడు ఆ హీరోలకు కూడా పేరు ప్రఖ్యాతలను సంపాదించింది పెడుతుంది. అలాంటి హీరోలను అభిమానించే అభిమానుల పట్ల హీరోలు కూడా ఎక్కువ ప్రేమాభిమానాలు చూపిస్తుంటారు.ఈ విధంగా తన అభిమానుల పై ప్రేమను చూపించే వారిలో తమిళ స్టార్ సూర్య ముందువరుసలో ఉంటారని చెప్పవచ్చు. అందుకు నిదర్శనమే ఇది. ఎంతో బిజీ షెడ్యూల్లో గడుపుతున్న సూర్య తన అభిమాని పెళ్లి అని తెలుసుకొని ఆ పెళ్లి మండపానికి చేరుకుని ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచారు..

సూర్య వీర అభిమాని ఆలిండియా సూర్య ఫ్యాన్ క్లబ్ సభ్యుడైన హరికి పెళ్లి నిశ్చయమైంది. ఈ విషయం తెలుసుకున్న హీరో సూర్య వధువు మెడలో తాళి కట్టే సమయానికి మండపానికి చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. తన చేతుల మీదుగా తాళిని వరుడికి అందించి దగ్గరుండి పెళ్ళి తంతు కార్యక్రమాన్ని జరిపించాడు. మీ కొత్త జీవితం ఎంతో సుఖంగా జరగాలని ఆ నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఒక్కసారిగా తన అభిమాన హీరో పెళ్లి మండపంలో చూసేసరికి వరుడు ఎంతో ఆనంద పడ్డాడు. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన సూర్య ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరినీ ఆకట్టుకున్నాయి.

ఇక సినిమాల విషయానికొస్తే సూర్య హీరోగా తెరకెక్కిన "ఆకాశమే నీ హద్దురా" చిత్రాన్ని దర్శకురాలు సుధా కొంగర ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.ఓటీటీలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం సూర్య గౌతమ్ మీనన్ దర్శకత్వంలో "నవరస" సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే తొమ్మిది పాత్రలను తొమ్మిదిమంది దర్శకులు ఒక పైసా తీసుకోకుండా తెరకెక్కించడం విశేషమని చెప్పవచ్చు. ఈ సినిమాను నెట్ఫ్లిక్స్ లో విడుదల చేసి వచ్చిన లాభాలను ఇండస్ట్రీలోని కార్మికులకు ఇవ్వనున్నట్లు చిత్రబృందం తెలియజేశారు. మరోవైపు హీరో సూర్య అగరం ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ, ఎంతోమందికి జీవితం కల్పిస్తున్నారు.




Next Story