రెండో పెళ్లి వార్తలపై స్పందించిన సురేఖావాణి

Surekha Vani About Second Marriage Rumours. నటి సురేఖ వాణీని ఆమె కూతురు సుప్రిత రెండో పెళ్లి చేసుకోమని సూచించిందని టాలీవుడ్ లో టాం టాం అవుతుంది. దీనిపై స్పందించిన సురేఖ వాణి.

By Medi Samrat  Published on  21 Feb 2021 3:11 PM GMT
Surekha Vani About Second Marriage Rumours

నటి సురేఖా వాణి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరైంది.. ఇక బుల్లితెర పై మొగుడ్స్ పెళ్ళామ్స్ అనే షో ద్వారా పాపులర్ అయిన తరువాత వరుస సినిమాల్లో అక్క,వదిన,పిన్ని వంటి పాత్రలు పోషిస్తూ.. ఫ్యామిలీ ఆడియెన్స్ కు దగ్గరయ్యింది. కొన్నాళ్ల వరకూ ఈమె జీవితం చాలా సంతోషంగా సాగింది. అయితే 2019 లో ఈమె భర్త సురేష్ తేజ అనారోగ్యంతో మరణించడంతో మానసికంగా చాలా అప్సెట్ అయ్యింది.

తాజాగా సురేఖ వాణీని ఆమె కూతురు సుప్రిత రెండో పెళ్లి చేసుకోమని సూచించిందని టాలీవుడ్ లో టాం టాం అవుతుంది. దీనిపై స్పందించిన సురేఖ వాణి.. మరోసారి వివాహబంధంలోకి అడుగుపెట్టే ఆలోచన తనకు లేదని స్పష్టం చేసింది. యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన సురేఖ తెలుగులో తెరకెక్కిన ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించి గుర్తింపు తెచ్చుకుంది.

కాగా, సురేఖ త్వరలోనే రెండో వివాహం చేసుకోబోతుందంటూ గత కొన్నిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆమె కుమార్తె సుప్రీత నిర్ణయం ప్రకారమే సురేఖ మరోసారి ఏడడుగుల వైపు మొగ్గు చూపుతుందని నెట్టింట్లో పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా తన పెళ్లి వార్తల గురించి నటి సురేఖ స్పందించడం జరిగింది.. అవన్నీ అవాస్తవాలేనని.. తాను రెండో వివాహం చేసుకోవడం లేదని చెప్పింది. ఇక రెండేళ్ల క్రితం అనారోగ్యంతో సురేఖ భర్త కన్నుమూసిన విషయం తెలిసిందే.


Next Story