కొరటాల శివకు భారీ షాక్‌..!

మహేష్ బాబు-కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన సినిమా శ్రీమంతుడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన కేసులు కొరటాల శివను వెంటాడుతూనే ఉన్నాయి

By Medi Samrat  Published on  29 Jan 2024 9:16 PM IST
కొరటాల శివకు భారీ షాక్‌..!

మహేష్ బాబు-కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన సినిమా శ్రీమంతుడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన కేసులు కొరటాల శివను వెంటాడుతూనే ఉన్నాయి. శ్రీమంతుడు కోసం కొరటాల శివపై క్రిమినల్ కేసు నమోదైంది. కొరటాల శివ స్వాతి పత్రికలో వచ్చిన తన కథను శ్రీమంతుడు సినిమాకు ఉపయోగించారని రచయిత శరత్ చంద్ర నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం కొరటాలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. దీంతో కొరటాల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. శరత్‌చంద్ర సాక్ష్యాధారాలు, రచయితల సంఘం నివేదికను పరిశీలించిన తర్వాత తెలంగాణ హైకోర్టు నాంపల్లి కోర్టు ఇచ్చిన తీర్పునే వెలువరించింది. శ్రీమంతుడు కోసం కొరటాల శివపై క్రిమినల్ కేసు నమోదైంది. తన కథను కొరటాల కాపీ చేసేశారని పూర్తి ఆధారాలను కోర్టుకి సమర్పించారు రచయిత శరత్ చంద్ర. దీంతో కిందిస్థాయి కోర్టు తీర్పును సమర్దిస్తూ.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటికీ వెనక్కి తగ్గని కొరటాల.. సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణల అనంతరం సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు, స్థానిక కోర్టుల తీర్పులతోనే ఏకీభవిస్తూ తీర్పు చెప్పింది. కొరటాల పిటిషన్‌ను పరిగణలోకి తీసుకోలేమని, ఈ పిటిషన్‌ను వెనక్కి తీసుకోకపోతే డిస్మిస్ చేయాల్సి ఉంటుందని కోర్టు హెచ్చరించడంతో దర్శకుడు కొరటాల ప్రయత్నాలు కోర్టులో ఫలించలేదు. ‘శ్రీమంతుడు’ కథ కాపీ ఇష్యూలో కొరటాలపై క్రిమినల్ చర్యలు తప్పేలా కనిపించడం లేదు.

‘శ్రీమంతుడు’ సినిమా 2015లో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించగా కొరటాల దర్శకత్వం వహించారు. కొరటాల శివ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామా దేవరను రూపొందిస్తున్నారు. కొరటాల శివపై కోర్టు కేసుకు సంబంధించిన ఈ షాకింగ్ న్యూస్ తారక్ అభిమానులను షాక్ కు గురి చేస్తోంది.

Next Story