జర్నలిస్టుపై దాడి కేసులో సినీ నటుడు మోహన్‌బాబు సుప్రీంకోర్టు బిగ్ రిలీఫ్ దక్కింది. దాడి కేసులో ఆయనకు సర్వోన్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. గత ఏడాది డిసెంబర్ 10వ తేదీన జల్‌పల్లిలోని తన ఇంటి ఆవరణలో.. తనను ప్రశ్నించిన ఓ మీడియా ఛానల్ ప్రతినిధి విలేకరి మైక్ లాక్కుని ఆయనపై దాడి చేశారని అభియోగంపై మోహన్‌బాబుపై కేసు నమోదు అయింది. ఈ కేసులో మోహన్ బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు గత ఏడాది డిసెంబర్ 23న కొట్టివేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
తాజాగా మోహన్ బాబు పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ సుదాంశ్ దులియా ధర్మాసనం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. గత విచారణ సందర్భంగా మోహన్‌బాబుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే దాడి ఘటనపై తాను బహిరంగంగా క్షమాపణ చెప్పాను అని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు మోహన్ బాబు. నష్ట పరిహారం కూడా చెల్లించడానికి సిద్ధం ఉన్నట్లు మోహన్ బాబు స్పష్టం చేశారు.