సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ 71 పుట్టినరోజు.. శుభాకాంక్షల వెల్లువ

Superstar Rajinikanth turns 71.. fans birthday wishes .. సూపర్ స్టార్ రజనీకాంత్ ఈరోజు డిసెంబర్ 12న తన 71వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఆయన తన కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి

By అంజి  Published on  12 Dec 2021 10:06 AM IST
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ 71 పుట్టినరోజు.. శుభాకాంక్షల వెల్లువ

సూపర్ స్టార్ రజనీకాంత్ ఈరోజు డిసెంబర్ 12న తన 71వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఆయన తన కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి తన పుట్టినరోజును ఎంజాయ్ చేయనున్నారు. ఈ ప్రత్యేకమైన రోజున, సోషల్ మీడియా అతని అభిమానుల నుండి పుట్టినరోజు శుభాకాంక్షలతో నిండిపోయింది. తలైవర్ అని అభిమానులచే ముద్దుగా పిలుచుకునే రజనీకాంత్ భారతీయ సినిమా రంగాన్ని ఏలుతున్న సూపర్ స్టార్. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు తమిళనాడు వ్యాప్తంగా పలు కార్యక్రమాలను ప్లాన్ చేశారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ తన తదుపరి చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు. రజినీకాంత్‌ ప్రస్తుతం కరోటిడ్ ఆర్టరీ రివాస్కులరైజేషన్ సర్జరీ నుండి కోలుకుంటున్నారు. అనేక సోషల్ మీడియా పోస్ట్‌లలో రజనీకాంత్ బాగానే ఉన్నాడని వెల్లడించారు. డిసెంబర్ 12న రజనీకాంత్ తన 71వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. క్రియేటివ్ పోస్టర్లు, వీడియోల రూపంలో సోషల్‌ మీడియాలో అభిమానులు తలైవార్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రక్తదాన శిబిరాలను నిర్వహించడం నుండి అతని పాత చిత్రాలను ప్రదర్శించడం వరకు, రజనీకాంత్ అభిమానులు అతని పుట్టినరోజును జరుపుకోవడానికి ఎంతో ఉత్సహాన్ని ప్రదర్శిస్తున్నారు. రోజంతా రజినీకాంత్‌ అభిమానులు తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్లాన్ చేసారు.

రజనీకాంత్ చివరిసారిగా దర్శకుడు సిరుత్తై శివ అన్నత్తేలో కనిపించారు. ఇది దీపావళి సందర్భంగా నవంబర్ 4న ఈ సినిమా థియేటర్‌లలో విడుదలైంది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో రజనీకాంత్‌తో పాటు కీర్తి సురేష్, నయనతార, జగపతి బాబు, మీనా, ఖుష్బు మరియు ప్రకాష్ రాజ్ ఉన్నారు. రజనీకాంత్‌ ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్, దేశింగ్ పెరియసామి, సిరుత్తై శివతో సహా చాలా మంది మంచి దర్శకులతో చర్చలు జరుపుతున్నారు. త్వరలో రజనీకాంత్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించనున్నారు.

Next Story