హీరో మహేష్ బాబు కి సర్జరీ...స్పెయిన్ లో మోకాలికి ఆపరేషన్

Superstar Mahesh Babu undergoes surgery టాలీవుడ్‌ సినీ హీరో మహేష్‌ బాబుకు సర్జరీ జరిగింది. స్పెయిన్‌లో మహేష్‌ బాబు మోకాలికి వైద్యులు ఆపరేషన్‌ చేశారు.

By అంజి  Published on  14 Dec 2021 2:08 PM IST
హీరో మహేష్ బాబు కి సర్జరీ...స్పెయిన్ లో మోకాలికి ఆపరేషన్

టాలీవుడ్‌ సినీ హీరో మహేష్‌ బాబుకు సర్జరీ జరిగింది. స్పెయిన్‌లో మహేష్‌ బాబు మోకాలికి వైద్యులు ఆపరేషన్‌ చేశారు. వైద్యులు ప్రస్తుతం మహేష్‌ బాబుకి రెస్ట్ తీసుకోవాలని సూచించారు. దీంతో సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు దుబాయ్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. కోలుకున్నాక ఫిబ్రవరి నుంచి సినిమా షూటింగ్‌లో మహేష్‌ బాబు పాల్గొననున్నాడు. దుబాయ్‌లో మహేష్‌ బాబుతో పాటు ఆయన భార్య నమ్రతా శిరోద్కర్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మహేష్‌ బాబు మోకాలికి శస్త్ర చికిత్స జరిగిందన్న విషయం తెలిసిన అభిమానులు ఆయన ఆరోగ్యంపై కొంత ఆందోళన చెందారు.

గత కొంత కాలంగా మహేష్‌ బాబు మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. మహేష్‌ బాబు ఆరోగ్యంపై గత కొంత కాలంగా సోషల్‌మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా వైద్యుల సూచన మేరకు స్పెయిన్‌లో మహేష్‌ సర్జరీ చేయించుకున్నారు. ప్రస్తుతం మహేష్‌ బాబు సర్కారి వారి పాట సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల హీరో ఎన్టీఆర్‌ హోస్ట్‌గా చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరుడు ప్రోగ్రాంలో మహేష్‌ బాబు కనిపించారు. ఆ షోలో పలు ఆసక్తికర విషయాలను మహేష్‌ పంచుకున్నారు.

Next Story