కృష్ణ దశదిన కర్మ.. మహేశ్ బాబు భావోద్వేగం

Superstar Krishna Dasa Dina Karma. ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Nov 2022 7:02 PM IST
కృష్ణ దశదిన కర్మ.. మహేశ్ బాబు భావోద్వేగం

సూపర్ స్టార్ కృష్ణ నవంబరు 15న కన్నుమూశారు. కృష్ణ దశదిన కర్మ కార్యక్రమం నేడు హైదరాబాదులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దశదిన కార్యక్రమం సందర్భంగా భారీ భోజన ఏర్పాట్లు చేశారు. సినీ, రాజకీయ ప్రముఖుల కోసం ఎన్ కన్వెన్షన్ లో, అభిమానుల కోసం జేఆర్సీ కన్వెన్షన్ లో విందు ఏర్పాటు చేశారు. అభిమానుల కోసం 5 వేల పాసులు అందించారు. ఈ విందులో 32 రకాల వంటకాలు వడ్డించారు. కృష్ణ దశ దిన కార్యక్రమానికి మహేశ్ బాబు సహా ఆయన కుటుంబ సభ్యులందరూ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో మహేశ్ బాబు మాట్లాడుతూ.. భావోద్వేగ భరిత వ్యాఖ్యలు చేశారు. మా నాన్న నాకు ఎన్నో ఇచ్చారు... ఆయన ఇచ్చిన వాటిలో అన్నింటికన్నా గొప్పది... మీ అభిమానం. అందుకు ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. నాన్న ఎప్పటికీ నా హృదయంలో, మీ హృదయాల్లో నిలిచే ఉంటారు. ఆయన ఎప్పటికీ మన మధ్యే ఉంటారు. అభిమానుల్ని కలుసుకోవడం ఆనందం కలిగిస్తోందని అన్నారు మహేష్ బాబు.


Next Story