అప్పుడు కబడ్డీ.. ఇప్పుడు క్రికెట్.. మహేష్ ఆట మామూలుగా ఉండదుగా..!

Super Star Mahesh As Cricket Coach.అనిల్ రావిపూడి మరో సినిమాలో మహేష్ క్రికెట్ కోచ్ గా చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

By Medi Samrat  Published on  13 May 2021 5:13 AM GMT
mahesh

తెలుగులో స్పోర్ట్స్ డ్రామాలు చాలా తక్కువ వస్తూ ఉంటాయి. అది నిజమే అనుకోండి. కానీ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు స్పోర్ట్స్ డ్రామాల్లో చేస్తే సూపర్ గా ఉంటుందని అంటుంటారు. మహేష్ బాబు గతంలో 'ఒక్కడు' సినిమాలో కబడ్డీ ప్లేయర్ గా నటించిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు మహేష్ బాబు రేంజి భారీగా పెరిగింది. ఇలాంటి తరుణంలో మహేష్ బాబు మరో స్పోర్ట్స్ డ్రామాను ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా గురించి ఓ ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది.

మహేష్ బాబుకు 'సరిలేరు నీకెవ్వరూ' అనే హిట్ ను ఇచ్చిన అనిల్ రావిపూడి మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాగ్డ్రాప్ అని అంటున్నారు. ఈ సినిమాలో మహేష్ క్రికెట్ కోచ్ గా చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 'సరిలేరు నీకెవ్వరు'లో మహేష్‌‌ని ఆర్మీ ఆఫీసర్‌‌‌‌గా చూపించిన అనిల్.. ఈసారి తనని స్పోర్ట్స్‌‌ పర్సన్‌‌గా చూపించబోతున్నాడని అంటున్నారు. మహేష్‌‌ క్రికెట్ కోచ్ పాత్రలో కనిపిస్తాడనే టాక్ భారీగా నడుస్తోంది. ఇంతకూ ఈ టాక్ నిజమవుతుందో లేదో.. అది కూడా ఎప్పుడు మొదలవుతుందో తెలుసుకోడానికే చాలా టైమ్ పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే మహేష్ బాబు ఇప్పటికే మూడు సినిమాలు కమిట్ అయ్యారు.

పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారువారి పాట' పూర్తవకముందే త్రివిక్రమ్‌‌తో మూవీ ఓకే అయ్యింది. ఆర్.ఆర్.ఆర్. తర్వాత రాజమౌళి మహేష్ తోనే సినిమా చేయనున్నారు. అనిల్, మహేష్ కాంబో ఎప్పుడు సెట్స్‌‌కి వెళ్తుందో.. మహేష్ క్రికెట్ కోచ్ అవతారం ఎప్పుడు ఎత్తుతాడో తెలియని పరిస్థితి నెలకొంది.


Next Story