ఆసుపత్రిలోనే మహేష్ బాబు

Super Star Krishna Health Condition. సూపర్‌ స్టార్‌ కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోంది.

By Medi Samrat  Published on  14 Nov 2022 7:15 PM IST
ఆసుపత్రిలోనే మహేష్ బాబు

సూపర్‌ స్టార్‌ కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోంది. అర్థరాత్రి కృష్ణకు కార్డియాక్‌ అరెస్ట్‌తో కాంటినెంటల్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. డాక్టర్లు ఆయన్ను ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచి ట్రీట్‌మెంట్‌ అందించారు. రాత్రి నుంచి ఐసీయూలోనే చికిత్స అందిస్తున్నారు. 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమంటున్నారు వైద్యులు. అర్థరాత్రి కార్డియాక్‌ అరెస్ట్‌తో వచ్చారు. ఇంటెన్సివ్‌ కేర్‌లో ట్రీట్‌మెంట్‌ అందిస్తున్నామన్నారు డాక్టర్లు. ప్రస్తుతం ఆయన క్రిటికల్‌ స్టేజ్‌లోనే ఉన్నారని..వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని ప్రకటించారు.

కృష్ణ ఆరోగ్య పరిస్థితిని ఆస్పత్రిలో ఉండి పర్యవేక్షిస్తున్నారు మహేశ్ బాబు. డాక్టర్లను అడిగి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. 9ఏళ్లుగా కృష్ణకు కాంటినెంటల్‌ ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. రెగ్యులర్‌ హెల్త్‌ చెకప్స్‌ కూడా అక్కడే జరుగుతుంటాయి. అర్థరాత్రి గుండెపోటు వచ్చిన వెంటనే నానక్‌రామ్‌గూడలోని కాంటినెంటల్‌ ఆస్పత్రికి తరలించారు కుటుంబసభ్యులు. కృష్ణకు మంచి ట్రీట్‌మెంట్‌ అందుతోందని..అభిమానులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెబుతున్నారు కుటుంబసభ్యులు.


Next Story