గురువు మ‌ర‌‌ణంతో విషాదంలో సింగ‌ర్ సునీత

Sunitha Condolences To Her Music Teacher. సింగ‌ర్ సునీత‌.. గురువు స్వ‌ర్గ‌స్తులు కావ‌డంతో ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ భావోద్వేగానికి గురైంది.

By Medi Samrat
Published on : 4 Feb 2021 5:11 PM

Sunitha Condolences To Her Music Teacher

సింగ‌ర్ సునీత‌.. తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. త‌న గొంతుతో ఎంతో కాలంగా మ‌ధుర‌మైన పాట‌లు పాడుతూ వ‌స్తున్న సునీత.. అప్పుడప్పుడు డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గాను అల‌రిస్తూ ఉంటుంది. అయితే తాను ఈ స్థాయికి రావ‌డానికి కార‌ణ‌మైన‌.. గురువు స్వ‌ర్గ‌స్తులు కావ‌డంతో ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ భావోద్వేగానికి గురైంది.



పెమ్మరాజు సూర్యారావు గారు.. చిన్నప్పుడు నాకు సరిగమల భిక్ష పెట్టిన నా గురువు.. స్వర్గస్థులయ్యారు. ఇలాంటి మ‌హానీయుల్ని కోల్పోతుంటే చాలా బాధగా ఉందని రాసుకొచ్చింది. ఈ మేరకు సునీత ఆయన ఫొటోను షేర్‌ చేసింది. ఇది‌లావుంటే.. సునీత కొద్దిరోజుల క్రితం అమ్మపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వ్యాపారవేత్త రామ్‌ వీరపనేని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. త‌న కొడుకు, కూతురులు ద‌గ్గ‌రుండి ఈ వివాహాన్ని జ‌రిపించారు.


Next Story