ఇంట్లో కూర్చుని నా భర్త జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు

నటుడు గోవింద సినిమాల నుండి చాలా కాలం విరామం తీసుకున్న విషయం గురించి ఆయన భార్య సునీతా అహుజా బహిరంగంగా స్పందించారు.

By Medi Samrat
Published on : 13 May 2025 6:45 PM IST

ఇంట్లో కూర్చుని నా భర్త జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు

నటుడు గోవింద సినిమాల నుండి చాలా కాలం విరామం తీసుకున్న విషయం గురించి ఆయన భార్య సునీతా అహుజా బహిరంగంగా స్పందించారు. తిరిగి తెరపై కనిపించాలని కోరారు. గోవింద ఒక గొప్ప నటుడు అని, ఇంట్లో కూర్చుని తన సమయాన్ని వృధా చేసుకోకూడదని సునీత అన్నారు. నేను ఎప్పుడూ గోవిందతో నువ్వు లెజెండ్ స్టార్ అని చెబుతాను, నువ్వు 90లలో రాజువి అని చెబుతూ ఉంటానన్నారు. నేటి తరం పిల్లలు నీ పాటలకు నృత్యం చేస్తారు. అనిల్ కపూర్, సునీల్ శెట్టి, జాకీ ష్రాఫ్ వంటి మీ వయసు నటులు చాలా పని చేస్తున్నారు.. నువ్వు ఎందుకు పని చేయవు? గోవిందను సినిమాల్లో చూడటం మాకు చాలా ఇష్టమని చెబుతూనే ఉంటానని ఆమె అన్నారు.

గోవింద మళ్ళీ నటించడం చూడాలని తమ పిల్లలు కూడా కోరుకుంటున్నారని సునీత వివరించారు. ఆయనకు సరైన సలహా ఇవ్వలేదని ఆమె ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులను నిందించారు. గోవిందా తిరిగే కంపెనీ, స్నేహితులు ఏది మంచిదో చెప్పడం లేదు, చుట్టూ ఉన్న వాళ్లంతా ఆయన చెప్పే ప్రతిదానికీ వాళ్ళు అవును అనే అంటుంటారని విమర్శించారు.

1990లలోనూ, 2000ల ప్రారంభంలో హిందీ సినిమాల్లో అతిపెద్ద స్టార్లలో ఒకరైన గోవింద, 2008 తర్వాత పాపులారిటీ తగ్గిపోయింది. 'రావణ్', 'కిల్ దిల్' వంటి చిత్రాలలో సహాయక పాత్రలతో తిరిగి రావడానికి ఆయన ప్రయత్నించారు, కానీ అది ఆయన కెరీర్‌కు హెల్ప్ అవ్వలేదు. చివరిగా 2019లో విడుదలైన 'రంగీలా రాజా' చిత్రంలో గోవిందా కనిపించారు, ఇది బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.

Next Story