మహా గాంధీ అనే వ్యక్తి దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా చెన్నైలోని ఐదాపేట మెట్రోపాలిటన్ కోర్టు తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, అతని మేనేజర్ జాన్సన్‌లకు సమన్లు జారీ చేసింది. విజయ్ బృందం తనపై దాడి చేసిందని మహాగాంధీ ఆరోపించారు. ఈ మేరకు కోర్టు సమన్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. విజయ్ సేతుపతిపై ఇటీవల ఎయిర్ పోర్టులో జరిగిన దాడి కలకలం రేపిన విషయం తెలిసిందే. నవంబర్ 2 న, విజయ్ సేతుపతి జాతీయ అవార్డు అందుకున్న తర్వాత ఢిల్లీ నుండి చెన్నైకి తిరిగి వస్తుండగా, అతని బృందానికి మహా గాంధీ మధ్య ఘర్షణ జరిగింది.
వాస్తవానికి విమానాశ్రయంలో విజయ్‌పై దాడి చేయడానికి ప్రయత్నిస్తుండగా మహా గాంధీ దూకేందుకు ప్రయత్నిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. అయితే అప్పటికి ఇరువురి నుంచి ఎలాంటి ఫిర్యాదులు నమోదు కాలేదు. అయితే మహా గాంధీ తరువాత విజయ్ సేతుపతిని అభినందించడానికి ప్రయత్నించినప్పుడు, విజయ్ టీమ్‌లోని ఓ వ్యక్తి అతనితో వ్యంగ్యంగా మాట్లాడాడని మహాగాంధీ చెప్పాడు. దీంతో పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. బెంగళూరు విమానాశ్రయం వెలుపల తనపై జాన్సన్ దాడి చేశారని మహాగాంధీ ఫిర్యాదు చేశారు. విజయ్ సేతుపతి, జాన్సన్‌లకు సమన్లు జారీ అయ్యాయి. జనవరి 2న విచారణ జరగనుంది.