తెలుగు బిగ్‌బాస్‌లో కన్నడ బిగ్‌బాస్ హోస్ట్ సందడి
Sudeep Entry In Telugu Bigg Boss. తెలుగు బిస్‌బాస్ సీజన్ 4 ముగింపుకు మరికొన్ని వారాలే మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం
By Medi Samrat Published on 29 Nov 2020 4:38 PM ISTతెలుగు బిస్‌బాస్ సీజన్ 4 ముగింపుకు మరికొన్ని వారాలే మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. వారిలో ఎవరు విజేతగా నిలుస్తారా..? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు ఈ షో వేదికపై కనిపించగా.. ఆదివారం ప్రత్యేక గెస్ట్‌గా కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కనిపించనున్నాడు.
ఇప్పటికే ఆదివారం ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ పూరైంది. మొదట సోలోగా ఎంట్రీ ఇచ్చిన సుదీప్ బిగ్ బాస్ ఇంటి సభ్యులను ఆసక్తికర ప్రశ్న అడిగారు. కంటెస్టెంట్లు తనను విసిగించేస్తున్నారని హోస్ట్ నాగార్జున ఇంటికి వెళ్లిపోయారని, ఆయన ఈ షోకి ఎందుకు రావాలి అంటూ ఒక్కో కంటెస్టెంట్ ను సుదీప్ ప్రశ్నించారు. దాంతో ఒక్కో కంటెస్టెంట్ ఒక్కో రకంగా సమాధానమిచ్చారు.
మేం అందరం నాగ్ సర్ ను లవ్ చేస్తున్నాం అంటూ దేత్తడి హారిక బదులివ్వగా, నాగ్ సర్ ను ఆయన కుటుంబం అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తోందని కిచ్చ సుదీప్ స్పష్టం చేశారు. ఇక అభిజీత్ మాట్లాడుతూ నాగ్ సర్ కింగ్ అని, నాగ్ సర్ బెస్ట్ అని చెప్పడంతో, తాను కూడా అందుకు అంగీకరిస్తానని సుదీప్ పేర్కొన్నారు. అనంతరం నాగ్ కు వెల్కమ్ చెప్పడంతో బిగ్ బాస్ వేదికపై మళ్లీ కొత్త కాంతి వచ్చింది. ఇంటి సభ్యుల ముఖాలు వెలిగిపోయాయి.
సుదీప్ చేతుల మీదుగా ఒక కంటెస్టెంట్ ను సేవ్ చేయించడంతో పాటు త్వరలో కన్నడంలో తాను ప్రారంభించబోతున్న బిగ్ బాస్ కు సంబంధించిన విషయాన్ని కూడా సుదీప్ షేర్ చేసుకుంటాడు అంటూ మా వర్గాల ద్వారా తెలుస్తోంది. సుదీప్ ను బిగ్ బాస్ స్టేజ్ పై చూడనుండటంతో ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు.
కన్నడంలో బిగ్ బాస్ ను వచ్చే ఏడాది ఆరంభంలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కరోనా పరిస్థితుల కారణంగా బిగ్ బాస్ ఈ ఏడాది ఉంటుందో లేదో అని అంతా అనుకున్నారు. తెలుగు బిగ్ బాస్ ప్రారంభం అవ్వడంతో అక్కడ నుండి తమిళ మరియు హిందీ బిగ్ బాస్ లు ప్రారంభం అయ్యాయి. కాని కన్నడ బిగ్ బాస్ మాత్రం షురూ అవ్వలేదు. వచ్చే ఏడాది ప్రారంభించేందుకు ఇప్పటికే నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.