ప్రాణాంతక వ్యాధి బారినపడ్డ ఆర్టిస్ట్‌.. సాయం చేయాలని దర్శకుడు రాజమౌళి పిలుపు

S.S.Rajamouli calls for help for an artist struggling with a terminal illness. సినీ ఆర్టిస్ట్‌ దేవిక ప్రాణాంతక వ్యాధి బ్లడ్‌ క్యాన్సర్‌తో పోరాడుతుండటం.. ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళిని

By అంజి  Published on  29 Jan 2022 11:56 AM IST
ప్రాణాంతక వ్యాధి బారినపడ్డ ఆర్టిస్ట్‌.. సాయం చేయాలని దర్శకుడు రాజమౌళి పిలుపు

సినీ ఆర్టిస్ట్‌ దేవిక ప్రాణాంతక వ్యాధి బ్లడ్‌ క్యాన్సర్‌తో పోరాడుతుండటం.. ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళిని ఎంతగానో కలచివేసింది. ఈ విషయాన్ని జక్కన్న ట్విటర్‌ వేదిక అందరితో చెబుతూ.. తోచిన సాయం చేయాలని అభ్యర్థిచారు. ''బాహుబలి సినిమా షూటింగ్ సమయంలో దేవికతో కలిసి పనిచేశాను. అనేక పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఆమె కోఆర్డినేటర్. ఆమె అభిరుచి, అంకితభావం సాటిలేనిది. దురదృష్టవశాత్తు, ఆమె బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతోంది. తాను కింద షేర్‌ చేసిన కెట్టో ఫండ్‌ రైజింగ్‌ ద్వారా నిధులను విరాళంగా అందించవలసిందిగా నేను సవినయంగా అభ్యర్థిస్తున్నాను.'' అని ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ట్వీట్‌ చేశారు.

పోస్ట్‌లో దేవిక, తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి ఉన్న ఫొటోను కూడా ఉంచారు. కాగా ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు రాజమౌళి చేసిన పోస్టుపై భిన్నంగా స్పందిస్తున్నారు. '' మీరు బహుబలి సినిమాతో 800 కోట్ల రూపాయాలు సంపాదించారుగా.. మీరు ఎందుకు సాయం చేయరు'' అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఆర్టిస్ట్‌ దేవిక చికిత్స కావాల్సినంత డబ్బులను మీరు తప్పకుండా సమకూరుస్తారని ఆశిస్తున్నాం అంటూ ఇంకొందరు వ్యాఖ్యలు చేశారు. ఎక్కువ మంది నెటిజన్లు మాత్రం.. రాజమౌళి పెద్ద మనసుతో సాయం చేసి ఆదుకోవచ్చుగా అంటున్నారు.

Next Story