వారు చేసిన పనికి బాధపడ్డ రాజమౌళి

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఒడిశాలో SSMB29 షూటింగ్‌ షెడ్యూల్ ను పూర్తీ చేశారు.

By Medi Samrat
Published on : 20 March 2025 8:01 PM IST

వారు చేసిన పనికి బాధపడ్డ రాజమౌళి

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఒడిశాలో SSMB29 షూటింగ్‌ షెడ్యూల్ ను పూర్తీ చేశారు. అయితే బ్రేక్ టైమ్ లో ఆయన అక్కడి పర్వత ప్రాంతాలను చూడడానికి తన సమయం కేటాయిస్తున్నారు. ఒడిశాలోని ఎత్తైన పర్వత శిఖరం అయిన డియోమాలి వెంట సోలో ట్రెక్‌ను ప్రారంభించారు. కానీ ఆయన తన ప్రయాణంలో ఎదుర్కొన్న సంఘటనలు నిరాశపరిచాయని అన్నారు. కొండ ఎక్కే ప్రాంతంలోనూ, ఎక్కిన తర్వాత అక్కడ ఉన్న చెత్తను చూసి బాధను వ్యక్తం చేశారు.

రాజమౌళి తన హైకింగ్ కు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆ పర్వతంపై పర్యాటకులు చెత్త చెదారం ‍అలాగే ఉంచడం చూసి నిరుత్సాహానికి గురైనట్లు తెలిపారు. ఇటువంటి సహజమైన అద్భుతమైన ప్రాంతాలను ఎంతో బాగా చూసోకోవాలని, ఒక ఒక్కరూ బాధ్యతగా తీసుకుంటే చాలా పెద్ద మార్పు వస్తుందన్నారు. ప్రతి సందర్శకుడు ఈ ప్రదేశాలను రక్షించడానికి చెత్తను తిరిగి తీసుకెళ్లాలని సూచించారు.

Next Story