రాజమౌళి డైరెక్షన్ లో 'డేవిడ్ వార్నర్' యాక్ట్ చేస్తే ఇంత అరాచకమా..!

రాజమౌళి సినిమాలంటే ఎంత భారీగా ఉంటాయో చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తన సత్తా ప్రపంచానికి తెలియజేశాడు

By Medi Samrat  Published on  12 April 2024 9:15 PM IST
రాజమౌళి డైరెక్షన్ లో డేవిడ్ వార్నర్ యాక్ట్ చేస్తే ఇంత అరాచకమా..!

రాజమౌళి సినిమాలంటే ఎంత భారీగా ఉంటాయో చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తన సత్తా ప్రపంచానికి తెలియజేశాడు. ఇక డేవిడ్ వార్నర్ అంటే మన తెలుగు వాళ్లకు ప్రత్యేకమైన అభిమానం. వార్నర్ పుష్ప సినిమాకు ఇచ్చిన ఎలివేషన్ తో సినిమా స్థాయి కూడా పెరిగిందనే చెప్పొచ్చు. ఇక టాలీవుడ్ లో నటించడం గురించి చాలా సార్లు డేవిడ్ వార్నర్ తన ఇష్టాన్ని బయట పెట్టాడు. అలాంటిది వార్నర్ రాజమౌళి డైరెక్షన్ లో యాక్ట్ చేస్తే!! ప్రస్తుతానికి అయితే చేయలేదు కానీ.. క్రెడ్ యాప్ లో ఆ ఊహ అనేది ఎలా ఉంటుందో చూపించారు. నిజంగా ఫన్నీగా అనిపించే యాడ్ అటు మూవీ లవర్స్ ను ఇటు క్రికెట్ లవర్స్ ను చాలా ఆకట్టుకుంటూ ఉందండోయ్.

మొదట రాజమౌళి క్రికెట్ మ్యాచ్ టికెట్ కౌంటర్ బయట నిల్చొని వార్నర్ కు ఫోన్ చేస్తాడు. "డేవిడ్ గారు.. మీ మ్యాచ్ టికెట్లపై నాకేమైనా డిస్కౌంట్ ఇస్తారా?" అని అడుగుతాడు. దానికి వార్నర్ స్పందిస్తూ.. "రాజా సర్.. మీ దగ్గర క్రెడ్ యూపీఐ ఉంటే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది' అంటాడు. మరి నార్మల్ యూపీఐ అయితే అని రాజమౌళి అడుగుతాడు. అయితే డిస్కౌంట్ కోసం నాకు మీరో ఫేవర్ చేయాలని వార్నర్ కోరతాడు. అది రాజమౌళి డైరెక్షన్ లో ఓ ఛాన్స్. డేవిడ్ వార్నర్ నిజంగానే తన డైరెక్షన్ లో నటిస్తే ఏమవుతుందో రాజమౌళి ఊహించేసుకుంటాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏమొస్తుంది చెప్పండి.. మీరు కూడా ఆ యాడ్ మీద ఓ లుక్ వేసేయండి.

Next Story