'ఆర్‌ఆర్‌ఆర్‌' చూసిన అవతార్‌ దర్శకుడు.. రాజమౌళి ఎమోషనల్‌ ట్వీట్‌

SS Rajamouli Meets Avatar Director James Cameron. ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి తీసిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాను హాలీవుడ్‌

By అంజి  Published on  16 Jan 2023 12:15 PM IST
ఆర్‌ఆర్‌ఆర్‌ చూసిన అవతార్‌ దర్శకుడు.. రాజమౌళి ఎమోషనల్‌ ట్వీట్‌

ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి తీసిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాను హాలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ వీక్షించారు. ఈ విషయాన్ని తెలుపుతూ రాజమౌళి ట్వీట్‌ చేశారు. 'ఆర్‌ఆర్‌ఆర్' ఆస్కార్‌కు నామినేట్‌ అయిన నేపథ్యంలో రాజమౌళి, కీరవాణిలు ఫ్యామిలీతో కలిసి అమెరికాలో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికాలో జరిగిన ఓ అవార్డు ఈవెంట్‌లో జేమ్స్‌ కామెరూన్‌ దంపతులను రాజమౌళి కలిశారు. వారితో కాసేపు ముచ్చటించారు. ఈ విషయాన్ని రాజమౌళి సోషల్‌మీడియాతో ద్వారా అభిమానులతో షేర్‌ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

''గ్రేట్‌ జేమ్స్ కామెరూన్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను చూశాడు. దాన్ని ఆయన చాలా ఇష్టపడ్డారు. అంతేకాకుండా తన భార్య సుజీకికు చూడమని చెప్పి మరోసారి చూశారు. సినిమా కోసం నాతో 10నిమిషాలు పాటు విశ్లేషించడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. మీరు ప్రపంచంలోనే టాప్ దర్శకుడు అంటూ ప్రశంసించడం ఆనందంగా ఉంది. మీ ఇద్దరికి ధన్యవాదాలు అంటూ'' కామెరూన్‌ దంపతులతో కలిసి దిగిన ఫోటోను షేర్‌ చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న సినిమా వేడుకల్లో 'ఆర్‌ఆర్‌ఆర్' సందడి కనిపిస్తోంది. సినిమా విడుదలై 10 నెలల అవుతున్నా.. ఇంకా ఈ సినిమా గురించే చర్చించుకుంటున్నారు.


Next Story