SS Rajamouli confirms RRR will release on January 7. భారత్‌లోనూ ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి కారణంగా ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షలు
By Medi Samrat Published on 29 Dec 2021 7:53 AM GMT
భారత్‌లోనూ ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి కారణంగా ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో థియేటర్లు మూత పడుతుండడంతో సినిమా విడుదల విషయంలో ఆ సినిమా యూనిట్ వెనక్కి తగ్గిందని, అనుకున్న సమయానికి ఆ మూవీ విడుదల కాకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. గత ఢిల్లీ ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించడంతో థియేటర్లు మూతపడ్డాయి. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికే జెర్సీ నిర్మాతలు తమ విడుదల ప్రణాళికలను రీషెడ్యూల్ చేయాలని నిర్ణయించుకున్నారు. డిసెంబర్ 31న సినిమా విడుదల కావడం లేదు.
ఏది ఏమైనప్పటికీ, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్ మరియు అజయ్ దేవగన్ నటించిన చిత్రం RRR విడుదల తేదీ జనవరి 7, 2022న ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేశారు చిత్ర నిర్మాతలు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా పడింది. ఈ సారి ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా పడబోదని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ స్పష్టం చేశారు. ఎక్స్‌క్లూజివ్.. బ్రేకింగ్ న్యూస్.. ఆర్ఆర్ఆర్ సినిమాను వాయిదా వేయట్లేదని ఎస్ఎస్ రాజమౌళి నాకు తెలిపారు. ఆర్ఆర్ఆర్ సినిమా 2022, జనవరి 7నే విడుదల కానుంది అని తరణ్ ఆదర్శ్ స్పష్టం చేశారు. అలాగే రాజమౌళితో తాను దిగిన ఫొటో పోస్ట్ చేశారు.