చికాగోలో పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన జక్కన్న

SS Rajamouli confirms RRR 2. రాజమౌళి దర్శకత్వం వహించిన “ఆర్ఆర్ఆర్” సినిమా ఏ స్థాయిలో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

By M.S.R  Published on  13 Nov 2022 4:20 PM IST
చికాగోలో పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన జక్కన్న

రాజమౌళి దర్శకత్వం వహించిన "ఆర్ఆర్ఆర్" సినిమా ఏ స్థాయిలో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ లు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ను ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ కురిపిస్తూ ఉంది. ఎన్నో దేశాల్లో విడుదలై మంచి పేరును తెచ్చుకుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా రావచ్చని కూడా వార్తలు కూడా గతంలో ప్రచారంలోకి వచ్చాయి.

తాజాగా చికాగోలో దర్శకధీరుడు రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా నిలిచాయి. చికాగోలో ఆర్ఆర్ఆర్ స్క్రీనింగ్ కి హాజరయిన రాజమౌళి మీడియా సమావేశంలో సినిమా సీక్వెల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన అన్ని సినిమాలకు తన తండ్రి విజయంద్రప్రసాద్ కథలు అందిస్తారని తెలియజేసిన రాజమౌళి.. సీక్వెల్ కి కూడా కథ సిద్ధం అవుతున్నట్లు తెలిపారు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ సినిమా మ్యానియా నుంచి బయటపడి, ఇతర ప్రాజెక్ట్ లో బిజీ అవుతున్నారు. నేను మాత్రం ఇప్పటికీ ఆ సినిమా సృష్టించిన ప్రభంజనంలోనే ఉన్నాను. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ కి వస్తున్న క్రేజ్ చూస్తుంటే చాలా గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు.


Next Story