'హృతిక్ రోషన్ నథింగ్' కామెంట్స్‌పై స్పందించిన రాజమౌళి

S.S. Rajamouli clarifies his old comment. టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి, గతంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మీద చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో

By Medi Samrat  Published on  15 Jan 2023 11:00 AM GMT
హృతిక్ రోషన్ నథింగ్ కామెంట్స్‌పై స్పందించిన రాజమౌళి

టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి, గతంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మీద చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘టాలీవుడ్ హీరో ప్రభాస్ ముందు హృతిక్ నథింగ్’ అంటూ అప్పట్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా.. ఆ వ్యాఖ్యలపై రాజమౌళి వివరణ ఇచ్చారు. ఎస్ఎస్ రాజమౌళి హృతిక్ రోషన్‌ను ప్రభాస్‌తో పోల్చిన పాత వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. పాత వీడియోలో వ్యాఖ్యలకు ఇటీవల రాజమౌళి క్షమాపణలు చెప్పారు. ఆ సమయంలో తన పదాల ఎంపిక తప్పు అని.. హృతిక్‌ను కించపరిచే ఉద్దేశ్యం లేదని ఒప్పుకున్నారు.

ప్రభాస్ బిల్లా సమయంలో “రెండేళ్ల క్రితం ధూమ్ 2 విడుదలైనప్పుడు, బాలీవుడ్ మాత్రమే ఇంత నాణ్యమైన చిత్రాలను ఎందుకు చేయగలదని నేను ఆశ్చర్యపోయాను. హృతిక్ రోషన్ లాంటి హీరోలు మనకు లేరా? అనుకున్నాను. ఇప్పుడే బిల్లా పాటలు, పోస్టర్, ట్రైలర్ చూశాను, ఒక్కటి మాత్రం చెప్పగలను. ప్రభాస్ ముందు హృతిక్ రోషన్ నథింగ్. తెలుగు సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లినందుకు మెహర్ రమేష్ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అని అన్నారు. ఇప్పుడు ఆ వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ వస్తున్నారు. దానిపై ఓ ప్రముఖ మీడియా సంస్థ ప్రశ్నించగా.. రాజమౌళి ఏ మాత్రం తడుముకోకుండా క్షమాపణలు చెప్పారు. “ఈ వ్యాఖ్యలు నేను చాలా కాలం కిందట చేశాను. 15-16 సంవత్సరాల కిందట ఆ కామెంట్స్ చేశా అనుకుంటున్నాను. అప్పట్లో ఏదో పొరపాటుగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నాను. హృతిక్ రోషన్ ను కించపరిచే ఉద్దేశం నాకు ఏ మాత్రం లేదు. నేను అతడిని చాలా గౌరవిస్తాను. గతంలో చేసిన కామెంట్లపై కాస్త ఫీలవుతున్నాను” అంటూ రాజమౌళి వివరణ ఇచ్చారు.


Next Story