మళ్ళీ థియేటర్లలోకి బాహుబలి.. ఈ సారి పెద్ద ప్లాన్..!

భారతీయ సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిన ‘బాహుబలి’ చిత్రం మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.

By Medi Samrat
Published on : 10 July 2025 9:28 PM IST

మళ్ళీ థియేటర్లలోకి బాహుబలి.. ఈ సారి పెద్ద ప్లాన్..!

భారతీయ సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిన ‘బాహుబలి’ చిత్రం మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా, రెండు భాగాలను కలిపి ఒకే చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో ఈ ఏడాది అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెలిపారు.

"పదేళ్ల క్రితం ఒక ప్రశ్న దేశాన్ని ఏకం చేసింది. ఇప్పుడు ఆ ప్రశ్న, సమాధానం రెండూ కలిసి ఒకే గ్రాండ్ ఎపిక్‌గా వస్తున్నాయి" అంటూ చిత్ర బృందం తెలిపింది. ఈ ప్రయాణం పదేళ్లు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని రాజమౌళి తెలిపారు. ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ చిత్రాలను కలిపి ఒకే సినిమాగా చూడాలన్న అభిమానుల కోరిక ఈ రీ-రిలీజ్‌తో నెరవేరనుంది.

Next Story