సోనూ సూద్ సతీమణి ఆరోగ్యం ఎలా ఉందంటే..?
నాగ్‌పూర్‌లో నటుడు సోను సూద్ భార్య సోనాలి సూద్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు.
By Medi Samrat
నాగ్‌పూర్‌లో నటుడు సోను సూద్ భార్య సోనాలి సూద్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆమె చికిత్స పొందుతున్న ఆసుపత్రి వైద్య బృందం హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది. సోమవారం రాత్రి జరిగిన ప్రమాదం సోనాలి, ఆమె సోదరి సునీత, ఆమె మేనల్లుడు సిద్ధార్థ్‌లకు పలు గాయాలు అయ్యాయి. తాజా నివేదికల ప్రకారం, వారి పరిస్థితి బాగా ఉంది. వారు కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.
ఆసుపత్రి నుండి వెలువడిన ప్రకటనలో "శ్రీమతి సోనాలి సూద్, ఆమె సోదరి, మేనల్లుడిని నిన్న రాత్రి దాదాపు 10.30 గంటలకు నాగ్‌పూర్‌లోని మాక్స్ హాస్పిటల్‌లోని అత్యవసర విభాగానికి తీసుకువచ్చారు. వారు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ముగ్గురు అక్కడికి చేరుకునే సమయానికి స్పృహలోనే ఉన్నారు. వారి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు" అని ఉంది. వారికి పలు గాయాలు అయ్యాయని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. అంతర్గత గాయాల గురించి క్షుణ్ణంగా పరీక్షించారని, ఏవీ కనుగొనబడలేదన్నారు. ఆమె మేనల్లుడు ప్రథమ చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయ్యాడు. సోనాలి సూద్, ఆమె సోదరి వైద్య బృందం పరిశీలనలో ఉన్నారని, బాగా కోలుకుంటున్నారని ఆసుపత్రి ప్రకటనలో ఉంది.