గుడ్ న్యూస్ చెప్పిన సోనూ సూద్.. ప్రజలకు ఇస్తున్న సలహా ఇదే

Sonu Sood tests Covid negative, Twitter says welcome back. హోమ్ క్వారెంటైన్ లో ఉన్న సోనూకు తాజాగా నెగటివ్ వచ్చింది.

By Medi Samrat  Published on  23 April 2021 1:20 PM GMT
sonu sood

సోనూ సూద్.. గతేడాది లాక్ డౌన్ సమయంలో అతడు చేసిన సహాయాన్ని ఏ ఒక్కరూ కూడా మరచిపోలేరు. ఎంతో మందికి సహాయం చేసి సూపర్ హ్యూమన్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆయన్ను కూడా కరోనా మహమ్మారి తాకింది. గత కొద్దిరోజులుగా హోమ్ క్వారెంటైన్ లో ఉన్న సోనూకు తాజాగా నెగటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో ఆయన అభిమానులు ఎంతో ఆనందపడుతూ ఉన్నారు.

ఇటీవల కరోనా మహమ్మారి బారిన ఆయనకు తాజా పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా సోనూసూద్‌ వెల్లడించారు. ఆక్సిజన్, రెమిడెసివిర్, బెడ్స్‌ ఉదయం లేచిన దగ్గర్నుంచీ, అర్ధరాత్రి నుండి మరుసటి ఉదయం వరకు ఈ మూడు పదాలే తనకు వినిపిస్తున్నాయని.. కొన్నిసార్లు పాస్ అవుతున్నా, మరి కొన్నిసార్లు విఫలమవుతున్నా.. అయినా ప్రయత్నిస్తూనే ఉంటానని.. దేవుడు అందరినీ చల్లగా చూడాలంటూ సోనూ ట్వీట్‌ చేశారు.

ఆగస్టు 15 న దేశభక్తిని చూపించే వారికి ఒక సందేశాన్ని కూడా ఇచ్చారు. దేశం కోసం ఏదైనా చేయటానికి , దేశభక్తిని చూపించడానికి ఇంతకు మించిన సమయం లేదని అందరూ స్పందించాలంటూ ఆయన ట్వీట్‌ చేశారు.Next Story
Share it