ఆయ‌న శిక్షణ పొందిన గాయకుడు కాదు.. కానీ గొప్ప సంగీత ద‌ర్శ‌కుడు

ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

By Medi Samrat  Published on  31 Jan 2025 9:39 AM
ఆయ‌న శిక్షణ పొందిన గాయకుడు కాదు.. కానీ గొప్ప సంగీత ద‌ర్శ‌కుడు

ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినిమాలకు ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు. ముక్కుసూటిగా మాట్లాడి వార్తల్లో కూడా నిలుస్తున్నాడు. ఇటీవల ప్ర‌క‌టించిన కొంతమంది అవార్డుల‌లో గాయకులకు పద్మశ్రీ అవార్డు రాకపోవడంపై కూడా ఆయన ప్రశ్నలు సంధించారు. ఆ త‌ర్వాత‌ ఇప్పుడు అతను సంగీత స్వరకర్త ఏఆర్ రెహమాన్ గురించి తన అభిమానులను కొంచెం ఆశ్చర్యానికి గురి చేశాడు.

సోనూ నిగమ్ పాపులర్ సింగర్‌గా పేరు తెచ్చుకున్నారు. మరోవైపు AR రెహమాన్ కూడా సంగీత ద‌ర్శ‌కుడిగానే కాకుండా కొన్ని ప్రముఖ పాటలకు కూడా తన గాత్రాన్ని అందించారు. ఇందులో రెహ్నా తు, తేరే బినా, ఖ్వాజా మేరే ఖ్వాజా వంటి పాటలు ఉన్నాయి.

సోను, AR రెహమాన్ 1990 నుండి కలిసి పనిచేస్తున్నారు. ఎవరితోనైనా ఎక్కువ కాలం పని చేస్తే వారి గురించి ఎక్కువ‌గా తెలిసివుంటుంది. రీసెంట్‌గా సోనూ ఓ ఇంటర్వ్యూలో ఏఆర్ రెహమాన్ ఎందుకు మంచి సింగర్ కాలేదో ఓపెన్‌గా చెప్పాడు.

తన గాత్రంతో ప్రజల హృదయాలను శాసించే గాయకుడు సోను నిగమ్ 02 ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో AR రెహమాన్ గురించి మాట్లాడారు. రెహమాన్ శిక్షణ పొందిన గాయకుడు కాదని, అయితే అతని స్వరం చాలా బాగుంటుందని చెప్పాడు. ఆయ‌న నిస్సందేహంగా గొప్ప సంగీత ద‌ర్శ‌కుడు.. కానీ మంచి గాయ‌కుడు కాద‌న్నారు.

సోనూ నిగమ్ తన అభిప్రాయాన్ని వివరిస్తూ.. 'సహజంగానే ఏఆర్ రెహమాన్ శిక్షణ పొందిన గాయకుడు కాదు.. అతని గాత్రం బాగుంటుంది.. ఆయ‌న‌ తనను తాను గొప్ప గాయకుడని ఎప్పుడూ చెప్పుకోడు, కాబట్టి దాని గురించి మనం ఏమి చెప్పగలం. కానీ ఆయ‌న‌ ఖచ్చితంగా గొప్ప సంగీత ద‌ర్శ‌కుడు. ఆయ‌న‌ ఎల్లప్పుడూ మంచి ట్యూన్‌లో ఉంటాడు. సంగీతంతో అనుబంధం ఉన్న వ్యక్తులు ట్యూన్‌లో ఉండటం ముఖ్యం.. ఎవరైనా ట్యూన్ చేయకపోతే అతని గొంతుకు అర్థం ఉండదన్నారు.

రెహమాన్ గానం గురించి మాట్లాడుతూ.. సోనూ నిగమ్ ఒక సంఘటనను గుర్తు చేసుకున్నారు. రెహమాన్ అనుమతితో జోధా అక్బర్ చిత్రంలోని 'ఇన్ లమ్హాన్' పాటలోని చిన్న భాగాన్ని తాను వ్రాసినట్లు గాయకుడు చెప్పాడు. ఆ పాటలో చిన్న భాగాన్ని నేను రాయ‌గా.. రెహమాన్‌కు నచ్చడంతో పాటలో చేర్చారని చెప్పాడు.

Next Story