సోనమ్ కపూర్ ఇంట్లో దొంగతనం.. కోట్ల విలువైన నగలు, బంగారం కొట్టేశారు

Sonam Kapoor, Anand Ahuja's Delhi residence robbed. ఆనంద్ అహుజాని బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే..!

By Medi Samrat  Published on  9 April 2022 1:54 PM GMT
సోనమ్ కపూర్ ఇంట్లో దొంగతనం.. కోట్ల విలువైన నగలు, బంగారం కొట్టేశారు

ఆనంద్ అహుజాని బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే..! త్వరలోనే ఆమె పండంటి బిడ్డనుగుడ్ న్యూస్ ను అభిమానులతో పంచుకుంది. అప్పటి నుండి అభిమానులు ఆమె డెలివరీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సోనమ్, ఆమె భర్తకు చెందిన న్యూఢిల్లీ నివాసంలో దొంగతనం జరిగినట్లు తెలిసింది. దేశ రాజధానిలోని వారి ఇంట్లో రూ.1 కోటి 41 లక్షల విలువైన నగలు, నగదు దోచుకెళ్లారు. ఈ ఘటన ఫిబ్రవరి 23న జరగగా, ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసు హైప్రొఫైల్‌గా ఉండడంతో గోప్యంగా ఉంచారు.

ఆమె న్యూఢిల్లీ నివాసంలో చోరీ జరిగి రూ. 1.41 కోట్ల విలువైన నగదు, నగలు చోరీకి గురికావడం ఆమె అభిమానులు షాక్ అయ్యారు. తమ ఇంట్లో జరిగిన దోపిడీపై సోనమ్ కపూర్ అత్త తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్‌లో మొదట ఫిర్యాదు చేశారు. ఇది హై ప్రొఫైల్ కేసు కావడంతో ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు వెంటనే దర్యాప్తు కోసం స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. సోనమ్, ఆనంద్ సిబ్బందిని పోలీసులు విచారిస్తున్నారు. ఢిల్లీ పోలీసులు 9 మంది కేర్‌టేకర్లు, డ్రైవర్లు, తోటమాలి, ఇతర కార్మికులతో పాటు 25 మంది ఉద్యోగులను ప్రశ్నిస్తున్నారు. పలు సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.

సోనమ్-ఆనంద్‌ల ఢిల్లీ నివాసం అమృత షెర్గిల్ మార్గ్‌లో ఉంది. ఫిబ్రవరి 11న తన అల్మారాలో నగలు, నగదు కోసం తనిఖీ చేయగా దొంగతనం జరిగిన విషయం తెలిసిందని సరళా అహుజా తన ఫిర్యాదులో పేర్కొంది. అందులో రూ.1 కోటి 41 లక్షల విలువైన నగలు, నగదు మాయమైనట్లు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 23న ఫిర్యాదు చేశారు.Next Story
Share it