రూ. 252 కోట్ల డగ్స్ కేసులో ఓర్రీకి సమన్లు

బాలీవుడ్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఓర్రీ ఓర్హాన్ అవత్రమణికి రూ.252 కోట్ల డ్రగ్స్ కేసులో ముంబై పోలీసులు నోటీసులు జారీ చేశారు.

By -  Medi Samrat
Published on : 20 Nov 2025 8:47 PM IST

రూ. 252 కోట్ల డగ్స్ కేసులో ఓర్రీకి సమన్లు

బాలీవుడ్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఓర్రీ ఓర్హాన్ అవత్రమణికి రూ.252 కోట్ల డ్రగ్స్ కేసులో ముంబై పోలీసులు నోటీసులు జారీ చేశారు. యాంటీ నార్కోటిక్ సెల్ ఘట్కోపర్ యూనిట్ ముందు హాజరు కావాలని ఆదేశించారు. ఈ కేసులో ఓర్రీ పాత్ర ఏంటో పోలీసులు వెల్ల‌డించ‌లేదు కానీ విచార‌ణ‌లో మాత్రం ఆయ‌న పేరు క‌నిపిస్తోంది. మ‌రోవైపు ఇటీవల యూఏఈ నుండి వ‌చ్చిన స‌లీం డోలా కుమారుడు తాహెర్ డోలాకు సంబంధించిన విచార‌ణ ప‌త్రాల్లోనూ ఓర్రీ పేరు బ‌య‌ట‌ప‌డిన‌ట్టు క‌థ‌నాలు వ‌చ్చాయి.

బాలీవుడ్ సోషలైట్ ఓర్హాన్ అవత్రమణి 252 కోట్ల రూపాయల మాదకద్రవ్యాల కేసుకు సంబంధించి ముంబై పోలీసులు విచారణ కోసం పిలిచారు. స‌లీం డోలా పై గతంలో డ్ర‌గ్స్ ఆరోప‌ణ‌లు వచ్చాయి. 2024 మార్చిలో ముంబై పోలీసుల యాంటీ-నార్కోటిక్స్ సెల్ (ANC) వెలికితీసిన ₹252 కోట్ల విలువైన మెఫెడ్రోన్ (MD) మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో లావిష్ అలియాస్ మహమ్మద్ సలీం సోహైల్ షేక్ ప్రధాన అనుమానితుడు. దక్షిణ ముంబైలోని డోంగ్రీకి చెందిన షేక్ గత మూడు సంవత్సరాలుగా దుబాయ్‌లో నివసిస్తున్నాడు.

Next Story