Video : పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటున్నారు.. స్పెషల్ అప్పియరెన్స్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చిన 'ఆర్ఆర్ఆర్‌'

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ప్రముఖ పాప్ సింగర్ స్మిత సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసిన 'భీమవరం బీట్' అనే వీడియో సాంగ్‌లో స్పెషల్ అప్పియరెన్స్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చారు.

By -  Medi Samrat
Published on : 3 Jan 2026 6:00 PM IST

Video : పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటున్నారు.. స్పెషల్ అప్పియరెన్స్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చిన ఆర్ఆర్ఆర్‌

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ప్రముఖ పాప్ సింగర్ స్మిత సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసిన 'భీమవరం బీట్' అనే వీడియో సాంగ్‌లో స్పెషల్ అప్పియరెన్స్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ పాటలో స్మిత, ర్యాపర్ నోయల్ స్టెప్పుల‌తో అద‌ర‌గొట్ట‌గా.. డిప్యూటీ స్పీకర్ రఘురామ ఓ చిన్న స్టెప్పు వేయ‌డం పాట‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


సంక్రాంతి పండుగను పురస్కరించుకుని స్మిత, నోయల్ ఈ 'భీమవరం బీట్' పాటను రూపొందించారు. పండగ వాతావరణం నేప‌థ్యంలో విడుద‌లైన ఈ పాట‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ వీడియో సాంగ్‌లో స్మిత, నోయల్ డ్యాన్సులు ఎంతో ఉత్సాహభరితంగా ఉన్నాయి. వీరితో పాటు రఘురామ కృష్ణరాజు కూడా స్టెప్పులేయడంతో పాటకు మరింత క్రేజ్ వచ్చింది. అలాగే పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ లిరిక్స్‌లో వ‌చ్చే తెగ ఆక‌ట్టుకుంటున్నాయి. దీంతో విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

Next Story