దసరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిన్న మార్పు.. తెలుసుకోండి

Small change in Dasara movie pre release event. నాని - కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న దసరా చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు.

By M.S.R  Published on  25 March 2023 4:45 PM IST
దసరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిన్న మార్పు.. తెలుసుకోండి

నాని - కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న దసరా చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మి వెంకటేశ్వర బ్యానర్స్ పై నిర్మాత చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచాయి. మార్చి 30న చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళం, కన్నడలో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అనంతపూర్ లోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. అయితే వెన్యూలో చిన్న మార్పు ఉందని తాజాగా చెప్పుకొచ్చారు. ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో కాకుండా 'పీవీకేకే ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్' లో ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఈవెంట్ కు ఎవరు చీఫ్ గెస్ట్ గా వస్తున్నారనేది తెలియాల్సి ఉంది.

దసరా సినిమా అడ్వాన్స్ బుకింగ్‌లు మొదలయ్యాయి. బుక్ మై షో, పేటీఎం ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఏఎంబీ సినిమాస్, ఏషియన్ సినిమాస్ లాంటి మల్టీప్లెక్స్‌లలో టిక్కెట్ ధరలు రూ.295 గా, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధర రూ.175గా నిర్ణయించినట్టు సమాచారం. యూఎస్ బుకింగ్ లు మార్చి 14వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి.


Next Story