స్టార్ హీరోపై చెప్పులు విసిరారు.. చిత్ర పరిశ్రమ తీవ్ర ఆగ్రహం

Slipper hurled at Kannada actor Darshan Thoogudeepa during 'Kranti' promotional event. ఆదివారం సాయంత్రం కర్ణాటకలోని హోసపేటలో తన రాబోయే చిత్రం క్రాంతి ప్రమోషన్‌లో

By Medi Samrat  Published on  20 Dec 2022 5:15 PM IST
స్టార్ హీరోపై చెప్పులు విసిరారు.. చిత్ర పరిశ్రమ తీవ్ర ఆగ్రహం

ఆదివారం సాయంత్రం కర్ణాటకలోని హోసపేటలో తన రాబోయే చిత్రం క్రాంతి ప్రమోషన్‌లో కన్నడ స్టార్ హీరో దర్శన్ తూగుదీపపై గుర్తు తెలియని వ్యక్తి చెప్పు విసిరాడు. వైరల్ అయిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలో.. నటుడు ఒక వేదికపై నిలబడి ఉండగా, అకస్మాత్తుగా, అతని భుజానికి చెప్పు తగిలింది. వెంటనే పోలీసు సిబ్బంది దర్శన్‌ను చుట్టుముట్టారు. సమావేశంలో అభిమానులను శాంతింపజేయడానికి దర్శన్ తూగుదీప ప్రయత్నించారు.

దర్శన్ కొత్త చిత్రం `క్రాంతి` ని ప్రమోట్ చేయడం కోసం వివిధ ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ఆ దాడి తర్వాత కూడా దర్శన్ అనుకున్న ప్రకారం మిగిలిన అన్ని కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ ఘటనపై నిందితుల ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జనవరి 26న విడుదల కానుంది `క్రాంతి` సినిమా. నటి రచితా రామ్ మాట్లాడుతూ ఉండగా దర్శన్‌పై ఓ వ్యక్తి చెప్పు విసిరాడు. అదృష్ట దేవత గురించి దర్శన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. అందుకే ఈ దాడి జరిగిందని కూడా అంటున్నారు. దర్శన్ పై జరిగిన ఈ దాడిని కన్నడ చిత్ర పరిశ్రమ తీవ్రంగా తప్పుబట్టింది.


Next Story