తెలుగు బ్లాక్ బస్టర్స్ మీద కన్నేసిన నెట్ ఫ్లిక్స్
నెట్ ఫ్లిక్స్.. ఈ ఓటీటీలో ఎన్నో అద్భుతమైన షోలు ఉంటాయి. చాలా మంది హ్యాపీగా చూసేస్తూ ఉంటారు.
By Medi Samrat Published on 29 Nov 2023 2:30 PM GMTనెట్ ఫ్లిక్స్.. ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఎన్నో అద్భుతమైన షోలు ఉంటాయి. చాలా మంది హ్యాపీగా చూసేస్తూ ఉంటారు. ఎన్నో భాషలకు సంబంధించిన షోలను, సినిమాలను నెట్ ఫ్లిక్స్ లో చూసేయొచ్చు. అయితే తెలుగు సినిమాలను ఈ మధ్యనే ఎక్కువగా తీసుకుంటూ ఉంది ఈ ఓటీటీ దిగ్గజం. అయితే కాస్త ఓల్డ్ సినిమాలు నెట్ ఫ్లిక్స్ లో లేకపోవడం తెలుగు వాళ్ళను కాస్త అప్సెట్ చేస్తూ ఉంది. అయితే నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు పలు తెలుగు ఓల్డ్ బ్లాక్ బస్టర్స్ మీద కన్నేసినట్లు తెలుస్తోంది.
నెట్ ఫ్లిక్స్ పాపులర్ పాత తెలుగు బ్లాక్ బస్టర్స్ హక్కులను కొనుగోలు చేసింది. ఈ రాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఆరు పాత తెలుగు బ్లాక్‌బస్టర్ చిత్రాలు ప్రసారం కానున్నాయి. పవన్ కళ్యాణ్ ఖుషి, చంద్రశేఖర్ యేలేటి ఐతే, శర్వానంద్ అమ్మ చెప్పింది, బాలకృష్ణ సూపర్ హిట్ సినిమా బంగారు బుల్లోడు, మారుతి ఈరోజుల్లో, ప్రభాస్ బుజ్జిగాడు రాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానున్నాయి. తన ప్రేక్షకులను పెంచుకోవడానికి, నెట్‌ఫ్లిక్స్ వివిధ ప్రముఖ తెలుగు చిత్రాల హక్కులను పొందింది. పవన్ కళ్యాణ్ ఖుషీకి ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 20 ఏళ్ల తర్వాత రీరిలీజ్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు రాబట్టింది. ఇక ప్రభాస్ కెరీర్ లో బుజ్జిగాడు సినిమాకు కూడా స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఆ సినిమా కమర్షియల్ గా భారీ సక్సెస్ అందుకోకపోయినా ఎంటర్టైన్మెంట్ విషయంలో హిట్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోదు.