బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ప్రస్తుతం 'సితారే జమీన్ పర్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం 2018లో విడుదలైన విమర్శకుల ప్రశంసలు పొందిన స్పానిష్ చిత్రం 'కాంపియోన్స్' అధికారిక రీమేక్. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ సంవత్సరం జూన్ 20న విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు.
ఈ చిత్రంలో అమీర్ ఖాన్ బాస్కెట్‌బాల్ కోచ్ పాత్రను పోషిస్తున్నాడు. మానసిక వికలాంగులకు శిక్షణ ఇచ్చే పాత్రలో మెప్పించనున్నాడు. బాలీవుడ్ నటి జెనీలియా కూడా ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆర్.ఎస్. ప్రసన్న దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ తన అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ కింద నిర్మించారు. 2022లో విడుదలైన 'లాల్ సింగ్ చద్దా'తో ఆమిర్ ఖాన్ భారీ ఫ్లాప్ ను చవిచూశారు. సితారే జమీన్ పర్ తో మంచి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. ఆమిర్ ఖాన్ సినిమాలకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.