చేతిలో కల్లు గ్లాసుతో సునీత

Singer Sunitha Tastes Toddy. సింగర్ సునీత కల్లు తాగుతున్నట్లు ఓ ఫోటో సోషల్ మీడియా లో వైరల్‌గా మారింది.

By Medi Samrat  Published on  5 March 2021 1:18 PM GMT
Singer Sunitha Tastes Toddy

ప్రముఖ టాలీవుడ్ సింగర్‌ సునీత తన పాటలతో తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అది అలా ఉంటే సింగర్ సునీత కల్లు తాగుతున్నట్లు ఓ ఫోటో సోషల్ మీడియా లో వైరల్‌గా మారింది. ఉమెన్స్ డే సందర్భంగా ఓ మీడియా నిర్వహించిన స్పెషల్ ప్రోగ్రాం కు అటెండ్ అయిన సునీత అక్కడి రిసార్టులో కల్లు తాగినట్లు కథనాలు వచ్చాయి. ఆ రిసార్ట్ లో తాటిచెట్లు ఉండడం.. అప్పుడే కార్మికులు కల్లు తీయడంతో ఆ కల్లును తోటి ఆర్టిస్టులతో కలిసి సునీత కల్లు తాగారని చెబుతూ ఉన్నారు. సునీత ఇటీవలే రెండో వివాహం చేసుకున్నారు. వ్యాపారవేత్త రామ్ ను ఆమె పెళ్లాడారు.

తాజాగా 'ప్రపంచ మహిళా దినోత్సవం' సందర్భంగా ఒక టీవీ చానల్ వాళ్లు ఓ ప్రత్యేక కార్యక్రమం కోసం ఆమెను ఆహ్వానించారు. హైదరాబాద్ శివార్లలోని ఓ రిసార్టులో ఆ కార్యక్రమం జరగింది. అక్కడ షూటింగ్ జరుగుతున్న సమయంలో గీత కార్మికులు తాటి కల్లును తీస్తున్నారు. సునీతతో పాటు యాంకర్ భార్గవి తదితరులు సరదాగా కల్లు టేస్ట్ చూశారు. గ్లాసుల్లో కల్లు పోయించుకుని తాగారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Next Story
Share it