నిశ్చితార్థం చేసుకున్న సింగ‌ర్ సునీత‌.. ఫోటోలు వైర‌ల్‌..!

Singer Sunitha Engagement. టాలీవుడ్‌లో గాయ‌నిగా మంచి పేరు సంపాదించుకున్నారు సునీత‌.

By Medi Samrat  Published on  7 Dec 2020 1:19 PM IST
నిశ్చితార్థం చేసుకున్న సింగ‌ర్ సునీత‌.. ఫోటోలు వైర‌ల్‌..!

టాలీవుడ్‌లో గాయ‌నిగా మంచి పేరు సంపాదించుకున్నారు సునీత‌. ఇటీవ‌ల ఆమె రెండో వివాహం చేసుకోబోతున్నారంటూ సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఇన్ని రోజులు బట్టి పెళ్లి గురించి ప్రచారం జరుగుతున్నా సునీత స్పందించకపోవడంతో ఈ వార్తలు నిజమే అని చాలా మంది భావించారు. తాజాగా ఆ వార్త‌ల‌ను నిజం చేస్తూ.. ఓ వ్యాపార వేత్త‌తో సునీత నిశ్చితార్థం నేడు జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. కొవిడ్ నిబంధ‌న‌ల నేప‌థ్యంలో ఇంట్లోనే చాలా నిరాడంబరంగా నిశ్చితార్థ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.



ఈ సందర్భంగా సునీత సిగ్గుపడుతూ దిగిన ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. సునీతకు 19 ఏళ్ల వయసులోనే పెళ్లి జ‌రిగింది. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆమెకు భర్తకు పడకపోవడంతో.. భర్త నుండి విడాకులు తీసుకున్నారు. ఇక ఆమె వివాహం చేసుకోబోతున్న ఆయనకు కూడా ఇది రెండో వివాహం అని తెలుస్తోంది.






Like every mother, I dream of settling my children down well. At the same time I am blessed with wonderful and...

Posted by Sunitha on Sunday, 6 December 2020





Next Story