కరోనాతో ప్రముఖ సింగర్ మృతి

Singer Sardool Sikander Dies At 60. ప్రముఖ పంజాబీ సింగర్ శార్దూల్ సికిందర్ కన్నుమూశారు.

By Medi Samrat  Published on  24 Feb 2021 11:28 AM GMT
Singer Sardool Sikander Dies At 60

గత ఏడాది నుంచి ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరినీ మట్టుపెట్టింది కరోనా వైౌరస్. సినీ రంగానికి చెందిన ఎంతో మంది నటులు ఇతర సాంకేతిక వర్గానికి చెందిన వారు కరోనాతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ కరోనా కష్టాలు పోలేదు. ఈ కరోనా వైరస్ వల్ల చాలా మంది రాజకీయ నాయకులు ఇంకా చాలా మంది క్రీడా రంగానికి చెందిన వారు.. సెలబ్రిటీలు మృతి చెందడం జరిగింది.

తాజాగా ఈ కరోనా మహమ్మారి ఇంకో సెలబ్రిటిని బలి తీసుకుంది...తన పాటలతో ఒకప్పుడు నార్త్ ఇండియా ప్రేక్షకులను ఎంత గానో అలరించిన ప్రముఖ పంజాబీ సింగర్ శార్దూల్ సికిందర్ కన్నుమూశారు. గత కొంత కాలంగా కరోనా సోకి ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇవాళ(బుధవారం) మొహాలీలోని ఓ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు.


ఆయన వయస్సు 60 ఏళ్లు. శార్దూల్ సికిందర్ పంజాబీ ఫోక్, పాప్ సింగర్. 1980లో ఆయన రోడ్‌వేస్ ది లారీ పేరిట మొదటి ఆల్బమ్‌ను విడుదల చేశారు.ఈ ఆల్బమ్ తో శార్దూల్‌కు మంచి పాపులారిటీ వచ్చింది.ఈ ఆల్బమ్ అప్పట్లో ఉత్తర భారతదేశంలో ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. చాలా పెద్ద హిట్ అయ్యింది...




Next Story