పాడుతా తీయగా కార్యక్రమంపై అంతటి ఆరోపణలా.?
'పాడుతా తీయగా' కార్యక్రమం తెలుగు ప్రజలందరికీ తెలిసిన షో.
By Medi Samrat
'పాడుతా తీయగా' కార్యక్రమం తెలుగు ప్రజలందరికీ తెలిసిన షో. ఈ షోలో న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న వారిపై గాయని ప్రవస్తి ఆరాధ్య సంచలన ఆరోపణలు చేశారు. కార్యక్రమంలో తనను అవమానించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో న్యాయనిర్ణేతలు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని, ముఖ్యంగా కీరవాణి స్వరపరిచిన పాటలు పాడిన వారికే అధిక మార్కులు లభిస్తున్నాయని ఆరోపించారు. కార్యక్రమం సెట్‌లో కూడా తాను తీవ్ర అవమానాలకు గురయ్యానని, తాను జీవనోపాధి కోసం పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల్లో పాటలు పాడతానని చెప్పినప్పుడు, దానిని ఎత్తి చూపుతూ న్యాయనిర్ణేతలు తనను కించపరిచారని ఆమె వాపోయారు. సెట్‌లో తనను బాడీ షేమింగ్ చేశారని, తన శరీరాకృతిపై వ్యాఖ్యలు చేస్తూ మానసికంగా బాధించారని ఆవేదన వ్యక్తం చేశారు. షూటింగ్ సమయంలో తనను ఒక చీడపురుగును చూసినట్లుగా చూశారని, ఎంతో చులకన భావంతో వ్యవహరించారని ఆమె అన్నారు. తాను తమిళంలో కూడా పలు పాటలు పాడానని, ఎన్నో వేదికలపై ప్రదర్శనలు ఇచ్చానని, కానీ ఎప్పుడూ ఇలాంటి అవమానకరమైన పరిస్థితిని ఎదుర్కోలేదని తెలిపారు.