టాలీవుడ్‌లో మ‌రో విషాదం.. సీనియ‌ర్‌ సింగర్‌ కన్నుమూత

Singer AVN Murthy Passed Away. గ‌త‌కొన్ని రోజులుగా టాలీవుడ్‌ను వ‌రుస విషాదాలు క‌మ్మేస్తున్నాయి. తాజాగా నేడు మరో విషాదం సీనియ‌ర్‌ సింగర్‌ కన్నుమూత.

By Medi Samrat  Published on  23 May 2021 2:09 PM GMT
సీనియ‌ర్‌ సింగర్‌ కన్నుమూత

గ‌త‌కొన్ని రోజులుగా టాలీవుడ్‌ను వ‌రుస విషాదాలు క‌మ్మేస్తున్నాయి. తాజాగా నేడు మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ ప్లే బ్యాక్ సింగర్ ఏవీఎన్ మూర్తి కన్నుమూశారు. గ‌త‌కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం కన్నుమూశారు. ప్లేబ్యాక్‌ సింగర్‌గా అనేక సినిమాలకు పాటలు పాడిన ఆయన తనదైన గాత్రంతో అబిమానుల‌ను మెప్పించారు. ఏవీఎన్ మూర్తి కుమారుడు శ్రీనివాస మూర్తి ప్రస్తుతం డబ్బింగ్ ఆర్టిస్టుగా పని చేస్తున్నారు. ఏవీఎన్ మూర్తి మృతిపై సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

ఇదిలావుంటే.. 'భారత్‌ బంద్‌' చిత్ర నిర్మాత ఎ. సుభాష్‌ సతీమణి సరోజినమ్మ(80) కన్నుమూశారు. ఆదివారం గుండెపోటుతో విన్ని హాస్పిటల్‌ ఆమె తుది శ్వాస విడిచారు. దివంగత దర్శకుడు కోడి రామకృష్ణకు ఆమె అత్తయ్య అవుతారు. కాగా వరుస మరణాలతో టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెల‌కొంది.


Next Story
Share it