Teaser : భాయ్.. సికందర్‌గా.. సరికొత్తగా..!

సల్మాన్ ఖాన్ కొత్త చిత్రం సికందర్ టీజర్ ఎట్టకేలకు విడుదలైంది.

By Medi Samrat  Published on  28 Dec 2024 5:45 PM IST
Teaser : భాయ్.. సికందర్‌గా.. సరికొత్తగా..!

సల్మాన్ ఖాన్ కొత్త చిత్రం సికందర్ టీజర్ ఎట్టకేలకు విడుదలైంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సికందర్ ఈద్ 2025న థియేటర్లలో విడుదలవ్వనుంది. సల్మాన్ పెద్ద స్క్రీన్‌పై అభిమానులను అకరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. టీజర్ లో సల్మాన్ ఖాన్ మునుపటి జోష్ ను చూడొచ్చు.


టీజర్‌ను ముందుగా సల్మాన్ 59వ పుట్టినరోజు నాడు డిసెంబర్ 27న విడుదల చేయాలని నిర్ణయించారు. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో, మేకర్స్ టీజర్ విడుదలను డిసెంబర్ 28కి వాయిదా వేశారు. కిక్, ముజ్సే షాదీ కరోగి వంటి సూపర్‌హిట్‌ల నిర్మాత సాజిద్ నదియాడ్‌వాలాతో సల్మాన్ ఖాన్‌ మరోసారి చేతులు కలిపాడు. సికందర్ ఈద్ 2025న విడుదల కానుంది. సల్మాన్ ఖాన్ కు తనదైన హిట్ లేక చాలా రోజులే అవుతోంది. మురుగదాస్ ఆ హిట్ ను అందిస్తాడని భాయ్ అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు.

Next Story