ఒక్కటైన బాలీవుడ్ ప్రేమజంట కియారా-సిద్ధార్థ్.. పెళ్లి ఫోటోలు వచ్చేశాయ్
Sidharth Malhotra and Kiara Advani share first official wedding pics.ప్రేమజంట కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా
By తోట వంశీ కుమార్ Published on 8 Feb 2023 8:13 AM ISTబాలీవుడ్ ప్రేమజంట కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటి అయ్యారు. రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్‌లోని సూర్యఘర్ ప్యాలస్‌లో మంగళవారం అతి కొద్ది మంది అతిథులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం అంగరంగవైభవంగా జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం వీరి వివాహ వేడుక జరిగింది. తమ పెళ్లికి వచ్చిన అతిథులు ఫోటోలు, వీడియోలు తీయకుండా ముందే ఈ జంట జాగ్రత్త పడ్డారు. సినీ ప్రముఖులు కోసం ముంబైలో త్వరలోనే రిసెప్షన్ నిర్వహించనున్నారు.
ఇక వీరి పెళ్లికి సంబంధించిన ఎటువంటి ఫోటోలు బయటకు రాకపోవడంతో వీరిద్దరు పెళ్లికి ఎలాంటి రంగు దుస్తులు ధరించారు. మూడు ముళ్లు వేసేటప్పుడు కియారా ఏడ్చిందా..? లేదా..? అంటూ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక అభిమానులను ఎక్కువ సేపు వెయిట్ చేయించకూడదని బావించిన ఈ జంట పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.
ఫోటోలను షేర్ చేయడంతో పాటు ‘‘ఇప్పుడు మేం శాశ్వతంగా బుక్ అయిపోయాము’’ (అబ్ హమారీ పర్మనెంట్ బుకింగ్ హో గయీ హై). మా కొత్త ప్రయాణానికి మీ ప్రేమ, ఆశీర్వాదాలు మాకు కావాలి. అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ కొత్త జంటకు నెటీజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పెళ్లి ఫొటోల్లో కియారా లేత గులాబీరంగు లెహంగాలో, సిద్ధార్థ్ క్రీమ్ కలర్ షేర్వానీలో కనిపించారు.
‘షేర్షా’ చిత్రంతో ఆన్‌స్క్రీన్ హిట్ పెయిర్‌గా నిలిచారు సిద్ధార్థ్-కియారా. ఆ తరువాత ఇద్దరు ప్రేమలో పడ్డారు. పలు సందర్భాల్లో వీరిద్దరి ప్రేమ, పెళ్లిపై ప్రశ్నలు ఎదురవ్వగా సమాధానాలు చెప్పకుండా చిరునవ్వుతో దాటవేసేవారు. ఎట్టకేలకు పెళ్లితో ఒక్కటి అయ్యారు.