క్షమాపణలు చెప్పిన సిద్ధూ జొన్నలగడ్డ
సెప్టెంబర్ నెలలో భారీగా సినిమాల విడుదల ఉండగా.. ఆ సినిమాలలో సలార్ పోస్ట్ పోన్ అయింది.
By Medi Samrat Published on 4 Sept 2023 8:02 PM ISTసెప్టెంబర్ నెలలో భారీగా సినిమాల విడుదల ఉండగా.. ఆ సినిమాలలో సలార్ పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో బ్లాక్‌బస్టర్ సినిమా డిజె టిల్లుకు సీక్వెల్‌గా రూపొందిన ‘టిల్లు స్క్వేర్’ ఈ నెలలోనే వస్తుందని భావించారు. అయితే ఈ సినిమా వాయిదా పడింది. ఇప్పుడు చిత్ర బృందం, హీరో సిద్ధూ జొన్నలగడ్డ ప్రేక్షకులకు అధికారిక క్షమాపణలు చెబుతూ నోట్‌ను విడుదల చేశారు.
టిల్లూ స్క్వేర్ సినిమా ప్రకటనతోనే మంచి బజ్ సంపాదించింది. సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని మేకర్స్ ప్రకటించగా, తర్వాత అక్టోబర్ 6కి మార్చారు. కానీ నిర్మాణానంతర పనులు పూర్తి కాకపోవడంతో నిర్మాతలు ఇంకో పోస్టర్‌ను విడుదల చేసి సినిమాను చెప్పిన తేదీకి తీసుకురాలేమని ప్రకటించారు. మంచి క్వాలిటీ వర్క్‌తో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా చూసుకోవడానికే తాము మరింత సమయం తీసుకుంటున్నామని చిత్ర దర్శక నిర్మాతలు ధృవీకరించారు. త్వరలో కొత్త తేదీని ప్రకటించనున్నారు. DJ టిల్లు సీక్వెల్ ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడింది. సిద్ధూ ఎనర్జీని, అనుపమ హాట్ అవతార్‌ని చూసేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు. టిల్లు స్క్వేర్ డిసెంబర్ నెలలో విడుదలకు తగిన తేదీని చూస్తున్నట్లు కొన్ని నివేదికలు కూడా ఉన్నాయి. అద్భుతం, నరుడా డోనరుడా వంటి చిత్రాల దర్శకుడు మల్లిక్ రామ్ టిల్ స్క్వేర్‌ని తెరకెక్కిస్తున్నాడు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.