భారీ వర్షాలు.. సిద్ధార్థ్ సినిమా వాయిదా

తమిళనాడులో తుఫాను హెచ్చరికల కారణంగా తన కొత్త చిత్రం 'మిస్ యు' వాయిదా పడిందని నటుడు సిద్ధార్థ్ ప్రకటించారు.

By Kalasani Durgapraveen  Published on  30 Nov 2024 6:25 AM GMT
భారీ వర్షాలు.. సిద్ధార్థ్ సినిమా వాయిదా

తమిళనాడులో తుఫాను హెచ్చరికల కారణంగా తన కొత్త చిత్రం 'మిస్ యు' వాయిదా పడిందని నటుడు సిద్ధార్థ్ ప్రకటించారు. ఎన్ రాజశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కన్నడ నటి ఆషికా రంగనాథ్ కూడా నటించారు. మొదట నవంబర్ 29, 2024న విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ సినిమాకు తెలుగులో కూడా ప్రమోషన్స్ చేశారు. తాజాగా సిద్ధార్థ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

మిస్ యు సినిమా విడుదల వాయిదా పడిందని, తమిళనాడు వ్యాప్తంగా రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రేక్షకుల భద్రత, సౌలభ్యం మేకర్స్‌కు ఈ నిర్ణయం చాలా ముఖ్యమైనదని తెలిపింది చిత్ర యూనిట్. మిస్ యు సినిమా ద్వారా సిద్ధార్థ్ రొమాంటిక్ కామెడీ జానర్ లో మరోసారి అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. సిద్ధార్థ్ ఈ సినిమాలో వాసుగా.. ఆషికా రంగనాథ్ సుబ్బలక్ష్మిగా కనిపించనుంది. జిబ్రాన్ సంగీతం, కె.జి.వెంకటేష్ సినిమాటోగ్రఫీని అందించారు.

Next Story