ఆ బోల్డ్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది

దీపక్ సరోజ్ హీరోగా నటించిన సిద్ధార్థ్ రాయ్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ వారాంతంలో ఈ సినిమా OTT ప్రీమియర్ గా రానుంది.

By Medi Samrat  Published on  2 May 2024 12:30 PM IST
ఆ బోల్డ్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది

దీపక్ సరోజ్ హీరోగా నటించిన సిద్ధార్థ్ రాయ్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ వారాంతంలో ఈ సినిమా OTT ప్రీమియర్ గా రానుంది. సినిమా ట్రైలర్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చినా.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ముద్ర వేయడంలో మాత్రం పూర్తిగా విఫలమైంది. ఇప్పుడు ఈ సినిమా OTT విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ సినిమాను విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డితో పోల్చినా ఈ సినిమా థియేటర్ల వద్ద మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోలేకపోయింది.

ఈ చిత్రం అడల్ట్ కంటెంట్‌ ఎక్కువగా ఉంది కాబట్టి. ఇది OTT ప్లాట్‌ఫామ్‌లో బాగా పనిచేసే అవకాశం ఉంది. మే 3వ తేదీ శుక్రవారం ఈ చిత్రం ఆహా వీడియోలో వస్తోంది. వి.యశస్వి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తన్వి నేగి, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్ కీలక పాత్రల్లో నటించారు. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ బ్యానర్‌లపై జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన ఈ చిత్రాన్ని నిర్మించారు.

Next Story