శృతి హాసన్ అభిమానులకు షాక్‌

అభిమానులకు నటి శృతి హాసన్ షాకిచ్చింది. మార్చి 28న హైదరాబాద్ లో జరగాల్సిన నటి శ్రుతి హాసన్ లైవ్ షో 'షాడోస్ అండ్ సిల్హౌట్స్' షెడ్యూల్ చేసిన సమయానికి కొన్ని గంటల ముందు వాయిదా పడింది

By Medi Samrat
Published on : 28 March 2025 7:50 PM IST

శృతి హాసన్ అభిమానులకు షాక్‌

అభిమానులకు నటి శృతి హాసన్ షాకిచ్చింది. మార్చి 28న హైదరాబాద్ లో జరగాల్సిన నటి శ్రుతి హాసన్ లైవ్ షో 'షాడోస్ అండ్ సిల్హౌట్స్' షెడ్యూల్ చేసిన సమయానికి కొన్ని గంటల ముందు వాయిదా పడింది. టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు ఆందోళన చెందకండని సూచించారు. లైవ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని ప్రిజం క్లబ్, కిచెన్‌లో జరగాల్సి ఉంది. ఊహించని సాంకేతిక సవాళ్ల కారణంగా, శ్రుతి హాసన్ కాన్సర్ట్ ను ఏప్రిల్ 26, 2025కి రీషెడ్యూల్ చేశారని తెలిపారు. బుక్‌మైషో ద్వారా బుక్ చేసుకున్న టిక్కెట్లు కొత్త తేదీకి చెల్లుబాటులో ఉంటాయని తెలిపారు.

శృతి హాసన్ పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. సింగర్‌గానూ పలు సాంగ్స్ పాడుతూ అందరినీ అలరించింది. పలు ప్రాంతాల్లో మ్యూజిక్ కన్సర్ట్స్ ను నిర్వహించి అందరినీ ఆకట్టుకుంది. హైదరాబాద్‌లో గ్రాండ్‌గా మార్చి 28న జరగాల్సిన ఈవెంట్‌ అనుకోకుండా రద్దు అయింది. నటన పరంగా చూస్తే శ్రుతి హాసన్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న 'కూలీ' చిత్రంలో నటించనుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ఆమె సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి నటించనుంది. సన్ పిక్చర్స్ నిర్మించిన 'కూలీ' ఈ ఏడాది చివర్లో థియేటర్లలో విడుదల కానుంది.

Next Story