ఆరోగ్యం బాలేదు.. ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను విజయవంతం చేయండి : శ్రుతిహాసన్‌

Shruthi Hasan Message to Waltair Veerayya Team. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన సినిమా 'వాల్తేరు వీరయ్య' ‍ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నేడు విశాఖపట్నంలో గ్రాండ్‌గా జరగనుంది.

By Medi Samrat  Published on  8 Jan 2023 7:23 PM IST
ఆరోగ్యం బాలేదు.. ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను విజయవంతం చేయండి : శ్రుతిహాసన్‌

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన సినిమా 'వాల్తేరు వీరయ్య' ‍ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నేడు విశాఖపట్నంలో గ్రాండ్‌గా జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చిత్ర బృందానికి సంబంధించి చాలా మంది ప్రత్యేక విమానంలో విశాఖపట్నంకు చేరుకున్నారు. కానీ హీరోయిన్‌ శ్రుతిహాసన్‌ మాత్రం కనిపించలేదు. ఆమె రాకపోవడానికి కారణం తెలిసింది.

సోషల్‌ మీడియాలో తనకసలు ఆరోగ్యం బాగోలేదని, ఇది కరోనా కాకకపోతే బాగుండంటూ ఓ ఫోటో పోస్ట్‌ చేసింది. 'అనారోగ్యం కారణంగా వాల్తేరు వీరయ్య గ్రాండ్‌ ప్రీరిలీజ్‌​ ఈవెంట్‌లో పాల్గొనలేకపోతున్నాను. ఇందుకు చాలా బాధగా ఉంది. నేను మీ అందరినీ మిస్సవుతున్నాను. ఈ సినిమాలో చిరంజీవిగారితో పనిచేయడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఈరోజు ఈవెంట్‌ను విజయవంతం చేయండి' అని చెప్పింది శ్రుతిహాసన్‌. ఈ సంక్రాంతికి తెలుగులో రెండు భారీ సినిమాలు వస్తున్నాయి. ఒకటి వాల్తేరు వీరయ్య, రెండు వీర సింహా రెడ్డి. ఈ రెండు సినిమాల్లోనూ శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.


Next Story