'ఉస్తాద్‌ భగత్‌సింగ్‌' ఊచకోత షురూ.. రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌'. హరీశ్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న

By అంజి  Published on  6 April 2023 9:30 AM IST
Pawan Kalyan, Ustad Bhagat Singh, Tollywood

'ఉస్తాద్‌ భగత్‌సింగ్‌' ఊచకోత షురూ.. రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌'. హరీశ్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా గతంలోనే లాంఛనంగా ప్రారంభమైంది. అయితే నిన్నటి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించుకుందని దర్శకుడు హరీశ్‌ శంకర్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. 'ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఈనాడే ఎదురౌవుతుంటే' పాటను ట్వీట్‌ చేస్తూ.. తాను ఎదురుచూస్తున్న సమయం వచ్చిందని ఆయన తెలిపారు.

హైదరాబాద్‌ నగరంలోని ఓ అల్యుమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభించినట్లు తెలుస్తున్నది. పవన్‌ కల్యాణ్‌ సెట్‌లోకి అడుగు పెట్టిన సందర్భంగా.. 'ఉస్తాద్‌ ఊచకోత' షురూ అంటూ చిత్రయూనిట్‌ ఓ ఆసక్తికర పోస్ట్‌ను పంచుకుంది. ఈ షెడ్యూల్‌లోనే పవన్‌ కల్యాణ్‌తో పాటు, మెయిన్‌ రోల్స్‌ సన్నివేశాలు తెరకెక్కించనున్నారని సమాచారం. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు పవన్‌ క్రిష్‌ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’, సుజీత్‌ దర్శకత్వంలో ‘ఓజీ’ (ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌), సాయి ధరమ్‌ తేజ్‌తో కలిసి ‘వినోదయ సితమ్‌’ రీమేక్‌లో నటిస్తున్నారు.

Next Story