రామ్ ఏంటి ఇలా మారిపోయాడు..!

Shocking and Surprising makeover of Ram for Boyapati film. యంగ్ హీరో రామ్ 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు.

By Medi Samrat  Published on  13 May 2023 4:10 PM IST
రామ్ ఏంటి ఇలా మారిపోయాడు..!

యంగ్ హీరో రామ్ 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. ఆ తర్వాత ఆ రేంజి హిట్ మళ్లీ దక్కలేదు. ఇప్పుడు బోయపాటి శీనుతో రామ్ జతకట్టాడు. ఆ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక రామ్ పుట్టినరోజు మే 15 కావడంతో ఆయన అభిమానులకు ఓ సర్ ప్రైజ్ ను ప్లాన్ చేసింది.

అందుకు సంబంధించిన పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో రామ్ ఒక బేస్ బాల్ బ్యాట్ పట్టుకొని రఫ్ లుక్‌లో కనిపించాడు. స్లిమ్‌గా ఉండే రామ్.. కొంచెం బొద్దుగా కనిపిస్తున్నాడు. ఇక మే 15న రిలీజ్ చేయబోయే గ్లింప్స్‌కు 'ఫస్ట్ థండర్' అని పేరు పెట్టారు. మే 15న ఉదయం 11:25 గంటలకు ఈ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 20న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. శ్రీలీల ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది. గతంలో రామ్ చేసిన 'ది వారియర్' చిత్రాన్ని నిర్మించిన శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.


Next Story