ఆ సినిమా ఫెయిల్యూర్ కు షాకింగ్ సమాధానం చెప్పిన ఐశ్వర్య రజనీకాంత్

లాల్ సలామ్ సినిమాకు సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించారు.

By Medi Samrat  Published on  12 March 2024 12:45 PM GMT
ఆ సినిమా ఫెయిల్యూర్ కు షాకింగ్ సమాధానం చెప్పిన ఐశ్వర్య రజనీకాంత్

లాల్ సలామ్ సినిమాకు సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించారు. రజనీకాంత్ మొదట కేవలం అతిధి పాత్ర అన్నారు. కానీ సినిమా మొత్తం రజనీకాంత్ కనిపిస్తారు. ఫిబ్రవరి 9న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఐశ్వర్య రజనీకాంత్ తన తాజా ఇంటర్వ్యూలలో ఈ సినిమా ఫెయిల్యూర్ కు షాకింగ్ కారణాలను చెప్పారు.

ఒకటి రజనీకాంత్ సినిమాలో ఉండడంతో.. కథలో చాలా మార్పులు చేయాల్సి వచ్చిందని అన్నారు ఐశ్వర్య. మేము మొదట 10 నిమిషాల రోల్ మాత్రమే ప్లాన్ చేసాము, కానీ అది పూర్తి-నిడివితో ఉన్న కీలక పాత్రగా ముగిసింది. కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం, మేము కథ చెప్పడమే కాకుండా.. స్క్రీన్ ప్లేని కూడా మార్చాము. ప్రేక్షకులు డిస్‌కనెక్ట్ కావడానికి ఇదే కారణమని కూడా ఆమె చెప్పింది. ఇక 21 రోజుల లాల్ సలామ్ ఫుటేజీ కనిపించకుండా పోయిందని ఆమె చెప్పుకొచ్చారు. ఆ విషయాన్ని మేము మొదట గమనించలేదన్నారు. ఫుటేజీలో ఎంతో మంది ఆర్టిస్టులు ఉన్న చాలా ముఖ్యమైన సన్నివేశాలు ఉన్నాయి. బడ్జెట్ పరిమితుల కారణంగానూ.. ఆ ఆర్టిస్టులు వేరే సినిమాలకు సైన్ చేసిన కారణంగా రీషూట్ చేయలేకపోయామని చెప్పారు. సినిమాలో ఏ మాత్రం దమ్ము లేకపోవడంతో.. కథ కూడా గ్రిప్పింగ్ గా లేకపోవడమే సినిమా ఫ్లాప్ కు ముఖ్య కారణమని అయితే సినిమా చూసిన వాళ్లు చెబుతున్నారు.

Next Story